Khammam District (imagecredit:swetcha)
ఖమ్మం

Khammam District: కోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం.. ఎక్కడంటే?

Khammam District: దసరా సందర్బంగా ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం, ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గురువారం జాతర ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజులు పాటు రాత్రి పగలు నిరంతరాయం సాగే ఈ జాతర కు జనం తరలివస్తున్నారు. రెండోవ రోజు శుక్రవారం అమ్మవారిని దర్శనానికి జనం క్యూ కట్టారు. ఆలయ వద్ద వాహన పూజకు విశేష ప్రాముఖ్యత ఉండటంతో భక్తులు వాహనలకు పూజ చేయించుకోవటానికి అధికంగా పోటీలు పడ్డారు. వాహన పూజకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో దేవదాయశాఖ దానికి అనుగుణంగా ఏర్పాట్లను చేసింది. వాహన పూజకు ప్రత్యేకంగా అర్చకులను నియమించారు. జాతరలో ఏర్పాటు చేసిన వినోద సాధనాలైన టవర్‌ రైడర్‌, రేంజర్‌ రైడర్‌, జాయింట్‌ విల్స్‌, కొలంబో, సోలంబో, క్రాస్‌ వీల్‌, డ్రాగన్‌ ట్రైన్‌ వంటి వాటిలో విహరిస్తూ యువత కేరింతలు కొట్టారు.

జాతరలో బూరల హోరు, యువత ఈలల శబ్దంతో జాతర ప్రాంగణం సందండిగా మారింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రస్తూ వాహనాలను పోలంపల్లి క్రాస్‌ రోడ్‌లోని కోటమైసమ్మ తల్లి ఆర్చి వద్దనే వాహనాలను నిలిపి వేస్తున్నారు. అక్కడి నుండి భక్తులు నడకనే రావాలని కోరుతున్నారు. జాతరలో ఆవాంచనీయ ఘటనలు జరగకుండా 24 గంటలకు ప్రత్యేక పోలీసు బంధోబస్తు నిర్వహిస్తున్నట్లు సింగర(Thirupathi Reddy), ఎస్సై బైరు గోపి(SI Gopi)లు తెలిపారు. జాతరలో అనుమానిత వ్యక్తుల సమాచారంను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జాతరలో వైద్యశాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరం వైద్య సేవలందిస్తుంది.

Also Read: Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.. అమెరికా నుండి వచ్చిన ఐటమ్ అదిరింది

కోటమైసమ్మతల్లి ఆలయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

దసరా జాతర సందర్భంగా కోటమైసమ్మ తల్లిని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah), ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu),ఇన్‌కం ట్యాక్స్‌ కమీషనర్‌ లావుడ్యా జీవన్‌లాల్‌, ఇల్లందు మాజీ మున్సిపాల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు లు కుటుంబ సభ్యులతో కలిసి కోటమైసమ్మ ఆమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఆధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం ఫలికారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కల్గకుండా ఆలయ చైర్మన్‌ డాక్టర్‌ పర్సా పట్టాభి రామారావు, ఈవో కొండకింది వేణుగోపాలాచార్యులు దగ్గరుండి జాతరను పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాస శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు నిర్వహిస్తున్నారు.

జాతరలో ధరల మోత

కోటమైసమ్మ తల్లి జాతరలో విపరీతమైన ధరల తో భక్తులు విస్మయం చెందారు. కొబ్బరికాయ ధర రూ.60, బంగు పేలాలు రూ.50, వాహన పూజ వస్తువుల ధర రూ.400 ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టెండర్‌ సమయంలో ధరల నియంత్రణపై ఎలాంటిఅంక్షలు లేక పోవటంతో పాటదారులు ఇష్టం వచ్చినట్లు ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. వినోధ సాధనాలైన టవర్‌ రైడర్‌, రేంజర్‌ రైడర్‌, జాయింట్‌ విల్స్‌, కొలంబో, సోలంబో, క్రాస్‌ వీల్‌, డ్రాగన్‌ ట్రైన్‌ వంటి వాటి ధరలు నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. రేండేళ్లక్రితం రూ.60 ఉన్న వీటి ధరలు గతేడాది. రూ.80, ఈ ఏడాది ఏకంగా రూ.100 పెంచారు. దీంతో ఇంటిల్లిపాది వినోదానికి దూరం అవుతున్నారు. కేవలం యువకులు, పిల్లలు మాత్రమే వాటిలో విహరిస్తున్నారు.

Also Read: KTR: కాంగ్రెస్ పాలనలో ఆర్థిక విధ్వంసం.. జీఎస్టీ వసూళ్లలో అట్టడుగుకు పతనం.. కేటీఆర్ ఫైర్

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..