Kunamneni Sambasiva Rao: స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాటు విషయంలో కలిసి వచ్చే కాంగ్రెస్, సీపీఐ(ఎం), వామపక్షపార్టీలతో కలిసి ముందుకెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ నెల 8న వెలువడనున్న కోర్టు తీర్పు ఆధారంగా, ఆ కేసులో సీపీఐ(CPI) కూడా ఇప్లిండ్ అయ్యే విషయంలో, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైన ఈ నెల 5న జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. హైదరాబాద్ మఖ్ధూంభవన్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బిల్లులు చెల్లుబాటు అవుతాయా?
బీసీల రిజర్వేషన్ల విషయంలో అందరూ కలిసి కృషి చేద్దామని చెప్పకుండా, రిజర్వేషన్లు సాధ్యమా? అంటూ బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రిజర్వేషన్ల అంశంలో చాలా మంది ‘డబల్ డ్రామాలు’ ఆడుతున్నారని దుయ్యబట్టారు. బీసీరిజర్వేషన్ల బిల్లులు చెల్లుబాటు అవుతాయా? లేదా? అనే చర్చలు జరుగుతున్నాయని, ఇటీవల శాసనసభలో ఆ బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు అమోదం తెలిపాయని గుర్తు చేశారు. ఇడబ్లుఎస్(EWS) పది శాతం రిజర్వేషన్లను పెంచడంతో రిజర్వేషన్లపైన ఉన్న 50 శాతం పరిమితి ఎప్పుడో దాటిందని అన్నారు. రాష్ట్రంలో బటమైన జడ్పీ(ZP), ఎంపీపీ(MPP), సర్పంచ్ స్థానాలను గుర్తించి, ఆ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని తమ పార్టీ శ్రేణులకు ఇది వరకే పిలుపునిచ్చినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రస్తావించిన సామాజిక కార్యకర్త సోనంను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
Also Read: V Hanumantha Rao: బతుకమ్మకుంట నిర్వహణ బాధ్యత మీదే: VH హనుమంతారావు
అమెరికాలో చదువుతున్న వారు..
నిరంకుశత్వంగా పరిపాలించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను అవమానించే విధంగా వ్యవహారిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రధాని మోడీ(PM Modhi) పల్లెత్తు మాట కూడా అనడం లేదన్నారు. ట్రంప్ చేసే తప్పులను కూడా మోడీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అమెరికాలో చదువుతున్న వారు లక్ష డాలర్లు చెల్లించాలనడం అన్యాయమని, అమెరికాలో భారత వ్యాపార సంస్థలపై విధిస్తున్నట్టు భారతదేశంలోని అమెరికా వ్యాపారాలపైన కూడా పన్నులు విధించే అవసరం ఉంటుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో ప్రధాని మోడీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏ జాతికి ద్రోహం జరిగినా, ఆ జాతికి భారతదేశం మద్దతుగా ఉండేదని గుర్తు చేశారు. మాట్లాడుతూ భారతదేశ వృద్ధి 0.3 శాతం తగ్గిందని, ఉత్పత్తి రంగం 6 నుంచి 3.6 శాతానికి తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి రంగాన్ని ప్రొత్సహించాల్సిన అవసరంఎంతైనా ఉందన్నారు. ఆయుధ సరఫరాలో భారతదేశం రెండవ స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, జాతీయ సీనియర్ నాయకుడు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి నర్సింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.ఎస్.బోస్ పాల్గొన్నారు.
Also Read: Sana Mir Controversy: కశ్మీర్‌పై పాక్ మాజీ మహిళా క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చెలరేగిన దుమారం
