V Hanumantha Rao (imagecredit:swetcha)
హైదరాబాద్

V Hanumantha Rao: బ‌తుక‌మ్మ‌కుంట నిర్వహణ బాధ్య‌త మీదే: VH హనుమంతారావు

V Hanumantha Rao: చారిత్రాత్మక బతుకమ్మ కుంట(Bathukamma Kunta)కు మళ్లీ జీవం పోసి, సర్వ హంగులో పూర్వ వైభవాన్ని కల్పించిన హైడ్రా(Hydraa) బతుకమ్మ కుంట బాధ్యతలు తీసుకోవాలని కాగ్రేస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హన్మంతరావు(V. Hanumantha Rao) బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాధ్(AV Ranganath) ను కోరారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకమైన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ‌కుంట‌ను బాగా అభివృద్ధి చేశారని, స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారని ఆయన కమిషనర్‌తో వ్యాఖ్యానించారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖ‌లు మారిపోయాయన్నారు.

నిర్వహణ బాధ్య‌త‌ హైడ్రా..

క‌బ్జాల చెర నుంచి బ‌తుక‌మ్మ కుంట‌ను కాపాడి, చెరువుగా అభివృద్ధి చేయ‌డం, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌డం ఇలా అన్ని కార్య‌క్ర‌మాలు ఎంతో వైభ‌వంగా జ‌రిగాయ‌న్నారు. ఈ విష‌యంలో హైడ్రా చేసిన కృషి అభినంద‌నీయ‌మ‌ని వీహెచ్ వ్యాఖ్యానించారు. బ‌తుక‌మ్మ‌కుంట‌ను అభివృద్ధి చేసి వ‌దిలేశారనే అప‌వాదు రాకుండా దీని ప‌రిర‌క్ష‌ణ, నిర్వహణ బాధ్య‌త‌ను హైడ్రా తీసుకోవాల‌ని విన‌తి ప‌త్రంలో కోరారు. లేని ప‌క్షంలో ఇక్క‌డ ప్ర‌స్తుత‌ం నెలకొన్న ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం పూర్తిగా దెబ్బ‌తింటుంద‌ని వీహెచ్ వ్యాఖ్యానించారు.

Also Read: Non Veg Shops Closed: మాంసం ప్రియులకు షాక్.. చికెన్, మటన్ షాపులు బంద్.. జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన

బోటు షికారు కొన‌సాగించాలి

బ‌తుక‌మ్మ‌కుంట ఇప్పుడు ప‌ర్యాట‌క ప్రాంతంగా మారింద‌ని, ప్రారంభోత్స‌వం నాటి నుంచి నేటి వ‌ర‌కూ అక్క‌డ ప్ర‌తి రోజు సాయంత్రం సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుందని వీహెచ్ వివరించారు. వంద‌లాది మంది వ‌చ్చి బ‌తుక‌మ్మ ఆడార‌న్నారు. వ‌చ్చే ఏడాది మ‌రింత వైభ‌వంగా బ‌తుక‌మ్మ ఆట‌లు ఆడుతార‌ని, ఈ నేప‌థ్యంలో చెరువు అందాలు ఏమాత్రం దెబ్బ‌తిన‌కుండా చూడాల‌ని కోరారు. ప్ర‌స్తుతం బ‌తుక‌మ్మ‌కుంట‌లో ఉన్న బోటు షికారును కొన‌సాగించాల‌ని కమిషనర్ ను కోరారు. చెరువును చూడ‌డానికి స్థానికేత‌రులు కూడా వ‌స్తున్నార‌న్నారు. బ‌తుక‌మ్మ కుంట సంద‌ర్శ‌న‌, వ్యాయామ స‌మ‌యాల‌ను కూడా నిర్దేశించాల‌ని కోరారు. ఆ స‌మ‌యాల‌ను గేటుపై పెట్టి, నిరంత‌రం వాచ్‌మ్యాన్‌లు ఉండేలా చూడాల‌న్నారు. గ‌తంలో ఇక్క‌డ చెత్త సేక‌ర‌ణ ఆటోలు పార్కింగ్ చేసేవార‌ని, వారికి ప్ర‌త్యామ్నాయ పార్కింగ్ ఏరియా చూపించాల‌ని కోరారు. అలాగే బ‌తుక‌మ్మ కుంట సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన వాహ‌న‌దారులు కూడా ఇష్టానుసారం వాహ‌నాల‌ను పార్కింగ్ చేయ‌కుండా నియంత్రించాల‌ని కోరారు. హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన వారిలో స్థానిక కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు నారాయ‌ణ‌స్వామి కూడా ఉన్నారు.

Also Read: Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..

Just In

01

Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్

Disqualification Hearing: నలుగురు ఎమ్మెల్యేల సుదీర్ఘ విచారణ.. నెక్స్ట్ ఏంటి?

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి సాంగ్.. సోనాక్షి సిన్హా అరిపించేసిందిగా!

Hydraa: నాలాల సమీపంలోని నివాసేతర భవనాలను హైడ్రా కూల్చివేత!

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం