Netflix: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సంచలన నిర్ణయం తీసుకుంది. మెుబైల్ నుంచి స్మార్ట్ టీవీలకు కనెక్ట్ అయ్యే కాస్ట్ ఫీచర్ ను సైలెంట్ గా తొలగించింది. ఇన్నాళ్లు ఫోన్ ద్వారా టీవీకి కనెక్ట్ అయ్యి నెట్ ఫ్లిక్స్ ను ఆస్వాదిస్తూ వచ్చిన యూజర్లకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అయితే నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయాన్ని ఒక్క రోజులో తీసుకోలేదని తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా క్రమపద్దతిలో క్యాస్ట్ పీచర్ తొలగింపు ప్రక్రియను అమలు చేస్తున్నట్ల సమాచారం. అయితే గత నెలలోనే నెట్ ఫ్లిక్స్ క్యాస్ట్ ఫీచర్ ను కోల్పోయినట్లు కొందరు యూజర్లు చెబుతున్నారు.
స్ట్రీమింగ్ చేయాలంటే?
ఆండ్రాయిడ్ ఆథారిటీ (Android Authority) వెబ్ సైట్.. నెట్ ఫ్లిక్స్ వెబ్ సైట్ చేసిన మార్పును తొలుత ప్రస్తావించింది. ‘గతంలో లాగా విస్తృత స్థాయిలో నెట్ ఫ్లిక్స్ కాస్టింగ్ ఫీచర్ ఉపయోగించుకోలేరు. మెుబైల్ సాయంతో స్మార్ట్ టీవీకి నెట్ ఫ్లిక్స్ ను కనెక్ట్ చేయటం ఇకపై సాధ్యం కాకపోవచ్చు. నెట్ ఫ్లిక్స్ నావిగేట్ చేయాలంటే మీ టీవీ లేదా స్ట్రీమింగ్ పరికరంతో వచ్చిన రిమోట్ ను వినియోగించాలి’ అని తొలుత రాసుకొచ్చింది.
ఆ టీవీల్లో మాత్రమే..
ఆండ్రాయిడ్ అథారిటీ వెబ్ సైట్ తొలుత పోస్ట్ చేసిన కథనాన్ని అప్ డేట్ చేస్తూ మరో కీలక విషయాన్ని తెలియజేసింది. నెట్ ఫ్లిక్స్ తన క్యాస్టింగ్ సపోర్టును కొన్నింటికి మాత్రమే పరిమితం చేసిందని అందులో పేర్కొంది. క్రోమ్ క్యాస్ థర్డ్ జనరేషన్ (Chromecast 3rd generation) లేదా అంతకంటే పాత మోడళ్లు (ఫిజికల్ రిమోట్ లేని పరికరాలు), గూగుల్ నెస్ట్ హబ్ స్మార్ట్ డిస్ ప్లే (Google Nest Hub Smart Display), కొన్ని కాస్ట్ ఎనేబుల్డ్ విజియో టీవీలు (Cast-enabled Vizio), కంపాల్ టీవీల్లో మాత్రమే కాస్ట్ ఫీచర్ సపోర్ట్ చేయనున్నట్లు సదరు రిపోర్టు పేర్కొంది.
Also Read: CM Revanth Reddy: ఖమ్మం జిల్లా ప్రాజెక్టులు కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిపించాయి: సీఎం రేవంత్ రెడ్డి
త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వివరణ!
కాగా నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే IOS, Google TV యాప్ లో AirPlayకి సపోర్టును నిలిపివేసింది. యాడ్ సపోర్ట్ ప్లాన్ ను ఉపయోగిస్తున్న వినియోగదారులు, టీవీ – మెుబైల్ ఒకే వైఫై పరిధిలో లేని పక్షంలో కాస్టింగ్, మిర్రరింగ్ ఫీచర్లను యూజర్లు వినియోగించడం సాధ్యం కాదని ఆండ్రాయిడ్ అథారిటీ కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే నెట్ ఫ్లిక్స్ కాస్ట్ బటన్ ను తీసివేయడానికి గల కారణాలపై స్పష్టత లేదు. కాస్ట్ ఫీచర్ తొలగింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన అనంతరం దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయవచ్చని ఓటీటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

