Stray Dog Attack: హైదరాబాద్ లోని హయత్‌నగర్‌లో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మూగ బాలుడిపై ఎనిమిది వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. దీంతో బాలుడి అరుపులు విన్న స్ధానికులు కుక్కలను తరిమికొట్టారు.
వివరాల్లోకి వెలితే..
హైదరాబాద్(Hyderabad) లోని హయత్ నగర్(Haythnagar) ప్రాంతంలో ఓ మూగ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై ఎకదాటిగా ఎనిమిది కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడిలో బాలుడి చెవులు, తల, నడుము, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన తిరపతి రావు, చంద్రకళ దంపతులు గత మూడేల్లుగా శివగంగా కాలనీలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు ప్రేమ్ చంద్(Prm Chendh) పుట్టుకతోనే మూగవాడిగా జన్మించాడు. ఈ క్రమంలో ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై ఎకదాటిగా కుక్కుల దాడిచేశాయి. ఆ సమయంలో ఇంటి పనిలో నిమగ్నమైన తల్లీ అదిగమనించలేదు. కుక్కల దాడికి చేసే సమయంలో బాలుడి అరుపులకు అక్కడి స్ధానికులు గమనించి కుక్కలను తరిమేసి బాలుడిని రక్షించారు. దీంతో అక్కడినుండి గాయపడిన బాలుడిని నిలోఫర్ హస్పటల్(Nilofer Hospital) కి పంపించడంతో బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
స్పందన కరువు
ఈ ప్రాంతంలో తరచూ వీధి కుక్కల దాడులు జరుగుతున్నా అధికారులు ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి స్ధానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
దారుణం.. మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్ హయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఘటన
ఎనిమిది కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన బాలుడు
బాలుడి అరుపులు విని కుక్కలను తరిమికొట్టిన స్థానికులు
ఈ ప్రాంతంలో తరచూ వీధి కుక్కల దాడులు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు… pic.twitter.com/FaCiNjWq9y
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2025
Also Read: Singareni: వరదలు భూకంపాలు ప్రకృతి ప్రకోపమే.. నిపుణుల కమిటీ ఛైర్మన్ ఇంద్రపాల్ సింగ్!

