Meesha movie: మీషా (Meesha) 2025లో విడుదలైన మలయాళ సస్పెన్స్-థ్రిల్లర్ చిత్రం. ఇది ఎమ్సీ జోసెఫ్ డైరెక్టర్‌గా, కథా రచనా బాధ్యతలు చేపట్టారు. కథా ప్రధానంగా మితున్ (కతీర్), ఆనందు (హక్కీమ్ షా) మరియు ఇమోధ్ (షైన్ టామ్ చాకో) వంటి స్నేహితుల మధ్య బెట్రయల్, బ్రదర్‌హుడ్ సర్వైవల్ థీమ్‌లపై ఆధారపడి ఉంది. చిత్రం మలయాళంలో విడుదలైంది. ఇది ఆగస్టు 1, 2025న థియేటర్లలో విడుదలైంది ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్‌లలో (సన్ NXT వంటివి) స్ట్రీమింగ్‌లో ఉంది.
Read also-Vikarabad Rice Mill Scam: వికారాబాద్ రైస్ మిల్లులో.. రూ.200 కోట్ల విలువైన బియ్యం మాయం?
కథా సారాంశం
చిత్రం నాన్-లీనియర్ స్ట్రక్చర్‌లో ముందుకు సాగుతుంది. మితున్, ఒక ఫారెస్ట్ వార్డెన్, తన పాత స్నేహితులను అడవిలో భోజనానికి ఆహ్వానిస్తాడు. కానీ ఈ ఆహ్వానం వెనుక దాగి ఉన్న రహస్యాలు, సామాజిక సమస్యలు (కుల వివక్ష, రాజకీయాలు) అడవిలోని సర్వైవల్ డ్రామా చిత్రాన్ని ఉత్కంఠభరితంగా మలిచిపెడతాయి. స్నేహం, విశ్వాసం బెట్రయల్ థీమ్‌లు ముఖ్యంగా హైలైట్ అవుతాయి.
పాజిటివ్స్
పెర్ఫార్మెన్సెస్: కతీర్ తన మలయాళ డెబ్యూలో అద్భుతంగా నటించాడు. హక్కీమ్ షా, షైన్ టామ్ చాకో, సుధి కోప్పా వంటి నటులు కూడా బలమైన పాత్రలు పోషించారు. వారి కెమిస్ట్రీ, ముఖ్యంగా స్నేహితుల మధ్య ఎమోషన్స్, చిత్రానికి బలం.
విజువల్స్ & సినిమాటోగ్రఫీ: సురేష్ రాజన్ కెమెరా వర్క్ అద్భుతం. అడవి సీన్స్ రియలిస్టిక్‌గా, సుర్రియల్ ఫీల్ ఇస్తాయి. గ్రీన్-స్క్రీన్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల కనిపించినప్పటికీ, ఓవరాల్ విజువల్స్ ఫాసినేటింగ్.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సూరజ్ ఎస్. కురుప్ స్కోర్ చిత్రానికి టెన్షన్‌ను పెంచుతుంది. సస్పెన్స్ సీన్స్‌లో BGM ఎక్సలెంట్.
థీమ్: మగ స్నేహత్వాలు, కుల రాజకీయాలు, సర్వైవల్ వంటి థీమ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. చిత్రం స్పూన్-ఫీడింగ్ లేకుండా మెసేజ్ ఇస్తుంది.
Read also-
నెగటివ్స్
స్క్రీన్‌ప్లే & పేసింగ్: నాన్-లీనియర్ స్ట్రక్చర్ కొన్ని చోట్ల కన్ఫ్యూజింగ్‌గా మారుతుంది. కుల-పాలిటిక్స్ థీమ్ అండర్‌కుక్డ్‌గా ఉంది, డిస్‌జాయింటెడ్ స్టోరీటెల్లింగ్ కారణంగా చిత్రం మధ్యలో లూజ్ అయిపోతుంది.
క్లైమాక్స్: సెటప్ లేయర్డ్‌గా ఉన్నప్పటికీ, క్లైమాక్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పూర్తిగా సాటిస్ఫై చేయదు. కొన్ని ప్లాట్ పాయింట్స్ గిమ్మికీగా అనిపిస్తాయి.
సపోర్టింగ్ క్యారెక్టర్స్: కొన్ని పాత్రలు అండర్‌డెవలప్డ్, స్నేహితుల బాండ్‌ను మరింత డెప్త్‌గా చూపించాల్సింది.
రేటింగ్: 3/5