Bigg Boss Promo: బిగ్ బాస్ హౌస్‌లో 10వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠగా ముగిసిన తర్వాత, డే 65 (మంగళవారం) ఎపిసోడ్ కోసం విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచింది. ఈ రోజు ఎపిసోడ్ ఒక ఆసక్తికరమైన కొత్త టాస్క్‌తో ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ తెలుగు ప్రోమో విడుదలైంది. దీంట్లో దివ్య మహారాణి భరణి ని హెడ్ మసాజ్ చేయమంటుంది. మహారాణి చెప్పడంతో భరణి రూమ్ లోపలికి వస్తారు. దానికి దివ్య అడగకుండా వస్తావా అంటూ.. అనడంతో భరణి మళ్లీ వెనక్కి వెళ్లి అడిగి వస్తాడు. తర్వాత హెడ్ మసాజ్ చేయడం మొదలు పెడతాడు. చేస్తూ.. జుట్టు ఏంటి ఇంత కరుగ్గా ఉంది అంటాడు.. సరదాగా.. దీంతో మహారాణి మరో టాస్క్ ఇస్తుంది. సుమన్ శెట్టిని పిలిచి భరణి కళ్లల్లోకి చూడమంటుంది. అలా చూస్తూనే మసాజ్ చేయమంటుంది. దానికి భరణి ఇది చాలా కష్టంగా ఇంకో పని ఏమైనా చెప్పండి మహారాణి అని అంటాడు. అక్కడి నుంచి ప్రోమో డైవర్ట్ అవుతుంది. బిగ్ బాస్ టీమ్ లోని సుమన్ శెట్టి, సంజనలకు టాస్క్ ఇస్తాడు. అది ఏంటంటే కొన్ని బాక్సులు ఇచ్చి వాటిని టవర్ రూపంలో నిలబెట్టమంటాడు.. అప్పుడు ఇద్దరూ ఎంతో కష్టం మీద నిలబెడతారు. ఇద్దరూ సమానంగా నిలబెట్టడంతో విజయం ఎవరిదో నిర్ణయించడానికి రాజుకి కష్టం అంవుతుంది. దీంతో ఎంతో కష్టం మీద బాక్సులు నిలబెట్టినుందుకు సంజన ను విన్నర్ గా ప్రకటిస్తాడు రాజు. దీంతో తనూజకు కోపం వస్తుంది. సుమన్ శెట్టిని విన్నర్ గా ప్రకటించమని పవన్ తో గొడవ పడుతుంది. మిగిలింది ఏం జరిగిందో తెలియాలి అంటే ఆగాల్సిందే..
Read also-Cult Conversation: కల్ట్ క్లాసిక్ ‘శివ’ కోసం కదిలొచ్చిన ముగ్గురు మొనగాళ్లు.. ఫైర్ చాట్ ఎలా ఉందంటే?
