Santana Prapthirasthu: కథలు ఎప్పుడూ హీరో హీరోయిన్ల చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి కథలకు భిన్నంగా మరో జోనర్ లో కధ రాబోతుంది ‘అదే సంతాన ప్రాప్తిరస్తు’. ఈ సినిమాలో విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మరి మరి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఉమా వంగూరి లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు.
Read also-Cult Conversation: కల్ట్ క్లాసిక్ ‘శివ’ కోసం కదిలొచ్చిన ముగ్గురు మొనగాళ్లు.. ఫైర్ చాట్ ఎలా ఉందంటే?
ఈ పాట ఎలా ఉందో చూస్తే -‘ మరి మరి నిన్ను వెతికేలా, మరవదు ఓ క్షణమైనా, మనసంతా నీ తలపులే, ప్రతి చోటా నీ గురుతులే, వేచా గడిచిన నిన్నల్లో, వెతికా నడిచిన దారుల్లో, వెలుగే విడిచిన నీడల్లో, వదిలి వెళ్లిన జాడల్లో…’అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట. ప్రాణంగా ప్రేమించిన భార్యతో వచ్చిన ఎడబాటు ఎలాంటి బాధను మిగిల్చిందో హీరో వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ పాటను పిక్చరైజ్ చేశారు.
Read also-12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..
ఈ పాటకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ కు మరో హిట్ సాంగ్ తగిలింది. ఉమ వంగూరి లిరిక్స్ అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. అదే సమయంలో ఇలాంటి ఎమోషనల్ సాంగ్ కూడా రావడంతో ఈ సినిమాకు మరింత ఎసెర్ట్ అవ్వనుంది. సినిమాల్లో ఇలాంటి పాటలకు ఎప్పుడూ జనాలు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ పాటను కూడా ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడటంతో మరింతగా జనాల్లోకి వెళ్లనుంది. ఈ పాట ఇచ్చిన మంచి ఫీల్ తో ఈ సినిమా విడుదల కోసం సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా నుంచి విడుదలైన ప్రతి చిత్రం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంది.
