Vikarabad Rice Mill Scam ( IMAGE credIT; swetcha reporter)
నార్త్ తెలంగాణ

Vikarabad Rice Mill Scam: వికారాబాద్​ రైస్ మిల్లులో.. రూ.200 కోట్ల విలువైన బియ్యం మాయం?

Vikarabad Rice Mill Scam: పండిచిన పంటకు గిట్టుబాటు రాక.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిత్యం అన్నదాత అవస్థలు పడుతుంటారు. ఎద్దు ఎడ్చిన ఏవసం… రైతు ఎడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదని పెద్దలు సామెతలు చేబుతారు. కానీ వ్యాపారులు, రాజకీయ పార్టీ నేతలు అధికారాలను అడ్డంపెట్టుకోని ప్రభుత్వ సొమ్మును అప్పన్నంగా, అధ్వాన్నంగా తింటున్న రోజు రోజుకు అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. అదే రైతు కష్టాన్ని నమ్ముకున్నందుకు నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది.

గత ప్రభుత్వంలో టెండర్ల పేరుతో ధాన్యాన్ని రైస్​మిల్లర్లకు అప్పగిస్తే ఓప్పందం ప్రకారం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్​ ఇవ్వలేకపోయారు. అంతేకాకుండా 2022‌‌23 ఖరీఫ్​ సీజన్​లో రైసుమిల్లర్లకు అప్పగించిన ధాన్యం రెండేండ్లు గడుస్తున్న నిమ్మకు నిరెత్తిన్నట్లు ఉండటంపై పలు అనుమానాలకు తావునిస్తుంది. గత ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన బంధువులకు రైస్​ మిల్లులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. వాళ్లే ఇప్పటి ప్రభుత్వంతో చేతులు కలిపి పెత్తన్న చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీళ్లే తిరిగి సీఎంఆర్​ బియ్యం ప్రభుత్వానికి అప్పగించేడంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. సుమారుగా వికారాబాద్​ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే ధాన్యం రీకవరి కావడం లేదని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.

 Also Read: BJP vs Congress: ప్రధాని తల్లి ఏఐ వీడియో రచ్చ.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

నిర్ధేశించిన సమయం ముగిసింది….

రాష్ట్ర ప్రభుత్వాలు రైస్​ మిల్లర్లు చేసే అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు ప్రజలు వేస్తున్నారు. ఒకప్పుడు రైస్​ మిల్లు రైతు బాధలు తెలిసిన వాళ్లే నిర్వహించేంది. నేడు వ్యాపార దృక్పతంతో ఆలోచించే వాళ్లు నిర్వహాకులుగా ఉంటున్నారు. అంతేకాకుండా రాజకీయ నేతలతో అంటకాగీన వాళ్లు సేకరించిన ధాన్యం రీకవరి చేసేందుకు మొఖం చాటేస్తున్నారు. వీళ్లు కేవలం వాళ్ల పూట గడుపుకోవడం కోసం ప్రభుత్వ సోమ్మును కాజేసేందుకు ఆలవాటు పడినట్లు తెలుస్తోంది. వికారాబాద్​ జిల్లాలో నడిపించే రైస్​మిల్లర్​ యాజమాన్యం వెనుక అధికార పార్టీ నేతల ఉంటారనే ప్రచారం సాగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ నేతలో అంటకాగడం మిల్లర్ల యాజమాన్యానికి ఆలవాటు. ఇప్పుడు కూడా రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో నడుస్తుంది. దీంతో అధికారు ఆదేశాలను బేఖతారు చేస్తూ నిర్ధేశించిన సమయంలో కేటాయించిన ధాన్యానికి బియ్యం డెలివరీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. నిర్లక్ష్​యమే కాకుండా ఎగవేతకు పాల్పడుతున్నట్లు సుస్పష్టమైతుంది.

మిల్లర్ల నిర్లక్ష్యంతోనే జాప్యం…

రైతుల వద్ద ప్రభుత్వం సేకరించిన ధాన్యం రైస్​మిల్లర్లకు సరఫరా చేశారు. అయితే సరఫరా చేసిన ధాన్యంకు బదులుగా బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత రైస్​మిల్లులపై ఉంది. ఆ మిల్లర్​ యాజమాన్యుల ఓప్పందం ప్రకారం ఏడాదిలోగా ప్రభుత్వం సూచించిన విధంగా ధాన్యానికి తగ్గట్టుగా బియ్యం అప్పగించాలి. కానీ ఇప్పటి రేండేండ్లు గడుస్తున్న బియ్యం అప్పగించడంలో రైసు మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో మిల్లర్లు బియ్యం ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కకు మళ్లించినట్లు భారీగా ఆరోపణలు వస్తున్నాయి. వికారాబాద్​ జిల్లాలోని 30 రైస్​ మిల్లర్లకు 38,613 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అప్పగించారు. ఇందుకుగాను 25,870 మెట్రిక్​ టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు సరఫరా చేయాలి. కానీ సుమారుగా 23వేల మెట్రిక్​ టన్నుల వరకు మాత్రమే బియ్యం అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంకా 2వేలకు పైగా మెట్రిక్​ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. అయినప్పటికి మిల్లర్​ యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా రూ.200కోట్లు విలువైన బియ్యం…

వికారాబాద్​ జిల్లా యాలాల్​ మండలం చెన్నారంలోని కృష్ణసా  యి రైస్​ ఇండస్ట్రీస్​ యాజమాన్యంపై సివిల్​ సప్లయ్​ కార్పోరేషన్​ అధికారులు కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 1850.600 మెట్రిక్​ టన్నుల వరి ధాన్యం రైస్​ మిల్లుకు అప్పగించారు. ఇందుకు 1239.902 మెట్రిక్​ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ 801 మెట్రిక్​ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించి, 438 మెట్రిక్​ టన్నుల బియ్యం ఇచ్చేందుకు నిర్లక్ష్యం చేశారు. దీనిపై అధికారులు జిల్లాలో ఏ ఏ రైస్​ మిల్లు ఎన్ని మెట్రిక్​ టన్నలు బియ్యం ఇవ్వాల్సి ఉందో ఆ వివరాలను సేకరించింది. అయితే 2024 పిబ్రవరి 29 వరకే ఇచ్చి పూర్తిగా నిలిపివేసిన మిల్లర్​ యాజమాన్యంపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో యాలాల్​ మండలం చెన్నారంలోని కృష్ణా సాయి రైస్​ ఇండస్ట్రీస్​ యాజమాన్యంపై అధికారులు స్ధానిక పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశారు. దీంతో లీజుకు తీసుకున్న వ్యక్తితో పాటు యాజమాన్యంపై ఎఫ్​ఐఆర్​ చేసి రీమాండ్ కు తరలించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆ రైస్​ మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి నగదు రూపంలో రూ.6కోట్ల3లక్షల51వేలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం జిల్లాలోని 30 రైస్​ మిల్లుల యాజమాన్యం రీకవరీ రూపంలో సుమారుగా రూ.200కోట్లకు పైగా నగదు చెల్లించాల్సి ఉందని సమాచారం.

చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము.. మోహాన్​ కృష్ణా, డీఎంసీఎస్ వికారాబాద్​

ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం (సీఎంఆర్​) సకాలంలో ఇవ్వకపోవడంపై మిల్లర్​ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశాము. నోటీసులకు స్పందించి బియ్యంగానీ, నగదు రూపంలో అప్పగించేందుకు ముందుకు వచ్చే మిల్లర్లకు మరో సమయం ఇచ్చి క్లియర్​ చేసుకోవాలని ముందుకు సాగుతున్నాము. లేనిపక్షంలో వారిపై చట్ట ప్రకారం చర్యలకు సిద్దమైనాము. అందులో భాగంగానే యాలాల్​ మండలం చెన్నారంలోని రైస్​ ఇండస్ట్రీస్​ యాజమాన్యంపై కేసు పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తమ విధులు చేపడుతున్నాము. 

 Also Read: GHMC: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాల చెల్లింపులకు లైన్ క్లియర్!

Just In

01

Revanth Reddy: గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలి… అధికారులకు సీఎం ఆదేశం

Dasoju Sravan: గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

Plane Loses Wheel: విమానం టేకాఫ్ సమయంలో ఊడిన చక్రం.. గమ్యస్థానం చేరుకున్నాక..

Bhupalpally Heavy Rains: భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాడుకతో 100కు పైగా గొర్రెలు మృతి.. ఎన్ని లక్షల నష్టమంటే..?

Sony LIV 2025 Originals: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్.. అన్నీ ఒకే చోట.. చూడాలంటే?