GHMC ((IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాల చెల్లింపులకు లైన్ క్లియర్!

GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ (GHMC) లో ఆగస్టు నెల వేతనాల వెతలకు ఎట్టకేలకు సాయంత్రానికి తెర పడింది. ఆగస్టు మాసానికి సంబంధించిన జీతాల చెల్లింపు ప్రక్రియ గత నెల 31వ తేదీన మొదలైన జీతాల చెల్లింపుల ప్రక్రియ దాదాపు 11 రోజుల పాటు కొనసాగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ (GHMC) లో పర్మినెంట్ ఉద్యోగులు సుమారు మూడున్నర వేల మంది కాగా, ఔట్ సోర్స్ ప్రాతిపదికన మరో 25 వేల మంది కార్మికులు వివిధ రకాల సేవలందిస్తున్నారు. వీరందరికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే వారు.

 Also Read: Shocking Incident: పాతబస్తీలో దారుణం.. మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఐదేళ్ల చిన్నారి.. చివరికి..?

జీతాల చెల్లింపులకు ఎలాంటి అడ్డంకులేర్పడలేదు

జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చినా బల్దియా ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తో పాటు సర్కారు నుంచి ప్రతి నెల అందుతున్న ఆర్థిక సహాయంతో జీతాల చెల్లింపులకు ఎలాంటి అడ్డంకులేర్పడలేదు. జీహెచ్ఎంసీలోని మొత్తం పర్మినెంట్, ఔట్ సోర్స్ ఉద్యోగులతో పాటు రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు జీహెచ్ఎంసీకి ప్రతి నెల రూ. 136 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి.

30 సర్కిళ్లలో ప్రతి నెల రూ. వంద కోట్లు

ఒక వైపు తీవ్రరూపం దాల్చుతున్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టి లో పెట్టుకుని, జీతాల చెల్లింపులో ఎలాంటి అడ్డంకులు రావద్దనే ఉద్దేశ్యంతో అధికారులు జీహెచ్ఎంసీలోని మొత్తం 30 సర్కిళ్లలో ప్రతి నెల రూ. వంద కోట్లు వసూలు కావల్సిందేనన్న టార్గెట్లు ఇచ్చారు. కానీ ఈ నెల జీతాలు ఆలస్యమయ్యే సరికి జీహెచ్ఎంసీలో నిధుల్లేనందుకే జీతాల చెల్లింపులు సకాలంలో సక్రమంగా జరగలేదని యూనియన్లు, కార్మికులు, ఉద్యోగులు భావించారు. కానీ వాస్తవానికి జీతాల చెల్లింపులు 11 రోజుల పాటు కొనసాగేందుకు మూడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణమన్న విషయాన్ని అధికారులు వెల్లడించారు.

ప్రతి నెల జీతభత్యాల చెల్లింపునకు సంబంధించిన అన్ని సర్కిళ్ల నుంచి నెలాఖరుకు మూడు రోజుల ముందే బిల్లులు అందగా, చెల్లింపుల కోసం అదనపు కమిషనర్ (ఫైనాన్స్ ) కమిషనర్ ఆమోదం తీసుకుని జీతాల చెల్లింపునకు అవసరమైన నిధుల విడుదల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వగానే ఆటోమెటిక్ క్లియరెన్స్ విధానంలో జీతాలు క్రెడిట్ అయ్యేవి. కానీ ఈ సారి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తాను ఆమోదించిన విషయాలకు మాత్రమే నిధులను మంజూరు చేయాలన్న సరి కొత్త నిబంధనను తెరపైకి తీసుకురావటం జీతాల చెల్లింపులో జాప్యానికి ప్రధాన కారణం కాగా, ఈఆర్ పీని అప్ డేట్ చేయటంతో పాటు ఎస్ బీఐ కూడా చెల్లింపు విధానాలను అప్ డేట్ చేయటం వంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లో జీతాల చెల్లింపునకు జాప్యం జరిగిందని తెలిసింది.

 Also Read: Gandhi Hospital: గాంధీ ఆసుపత్రికి కొత్త బాస్‌ నియామకం.. ఎవరంటే..?

పదకొండు రోజులు ప్రదక్షిణలే

ఈ నెల 1వ తేదీన క్రెడిట్ కావల్సిన జీతాలు ఖాతాల్లో క్రెడిట్ కావల్సిన జీతాలు, పెన్షన్లు ఉద్యోగులకు, రిటైర్డు ఉద్యోగులకు అందలేదు. దీంతో ఈ నెల 2వ తేదీ నుంచి రిటైర్డు ఉద్యోగులు, ఉద్యోగులు, యూనియన్ నేతలు ప్రతి రోజు అదనపు కమిషనర్ (ఫైనాన్స్ ) ఆఫీసుకు ప్రదక్షిణలు చేశారు. ముఖ్యంగా వివిధ రకాల యూనియన్ల నేతలు గడిచిన పదకొండు రోజుల పాటు కమిషనర్, అదనపు కమిషనర్ (ఫైనాన్స్) లను తరుచూ కలుస్తూ జీతాల గురించి ప్రస్తావించే వారు. జీహెచ్ఎంసీ పర్మినెంట్, ఔట్ సోర్స్ ఉద్యోగులతో పాటు రిటైర్డు ఉద్యోగుల్లో సుమారు సగం మందికి వివిధ రకాల ఈఎంఐలు ఉండటంతో అవి బౌన్స్ కావటంతో వారు అడిషనల్ ఛార్జీలు చెల్లించకతప్పలేదు.

రెండేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో పలు సార్లు జీతాల చెల్లింపులో తీవ్ర ఆలస్యం కావటంతో ఈఎంఐలు బౌన్స్ అయిన కొందరు ఉద్యోగులకు బ్యాంక్ ఖాతా సిబిల్ రేటు పడిపోయిందని వాపోతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు నెలకు సంబంధించిన జీతాల ప్రక్రియ గురువారం సాయంత్రం ముగియటంతో ఉద్యోగులు, సంబంధిత విభాగం అధికారులు కాస్త ఊపరిపీల్చుకున్నారు. ఈ మేరకు గత నెల జీతాల చెల్లింపునకు సంబంధించి ఈ నెల 1వ తేదీ నుంచి ఎదురైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చే నెల పునరావృతం కాకుండా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులు ఈఆర్ పీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులను ఆదేశించినట్లు తెల్సింది.

 Also Read: Chiranjeevi: ఈ కట్టె కాలేంత వరకూ మీ అభిమానినే.. ఈ మాట అంది ఎవరో తెలుసా?

Just In

01

Japan Centenarians: పాపం జపాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొట్టినా.. సంతోషం లేకపాయే!

Firecrackers Policy: టపాసులపై సుప్రీంకోర్టు అనూహ్య వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా నిషేధం!

Konda Surekha: అటవీ అమరవీరులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. మంత్రి కొండా సురేఖ స్పష్టం

The Girlfriend: అనుకోకుండా ఇంటికి వచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌పై.. ఏం జరిగిందంటే?

Anushka Shetty: సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క.. గుడ్ బై ? షాక్ లో ఫ్యాన్స్