Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణీ(Dr. Vani)ని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అడిషనల్ డీఎంఈగా ఉన్న డాక్టర్ వాణీ గతంలో ఇన్ చార్జీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గా, సంగారెడ్డి(Sangareddy) మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అడిషనల్ డీఎంఈగా కొనసాగుతున్నారు. శుక్రవారం(నేడు) అధికారికంగా గాంధీ సూపరింటెండెంట్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
Also Read: Gold Rate Today: సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. గోల్డ్ రేట్స్ ఎంత తగ్గాయో తెలుసా?
బ్రాండింగ్ కు రోల్ మోడల్ గా గాంధీ..
రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆసుపత్రులకు కార్పొరేట్ స్థాయి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్రాండింగ్(Branding) ను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదట గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)ని బ్రాండింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్రాండింగ్ లో భాగంగా ఆసుపత్రి ఎంట్రన్స్ నుంచి వార్డుల వరకు అనేక మార్పులు తీసుకురానున్నారు. ఆసుపత్రి రంగు నుంచి సిబ్బంది డ్రెస్సుల రంగు వరకు అన్నీ మారనున్నాయి. చదువుకోని రోగులు సైతం సంబంధిత డిపార్టుమెంట్లకు చేరుకునేలా.. వివిధ రంగులతో కూడిన సైన్ బోర్డుల ఏర్పాటు, వెయిటింగ్ సెక్షన్ లో కుర్చీలు, సరిపడినన్ని వీల్ చైర్లు, రిసెప్షన్, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నారు.
అలాగే, చికిత్స పొందిన అనంతరం రోగుల నుంచి ఆసుపత్రి సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈనేపధ్యంలోనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాలన బాధ్యతలు, బ్రాండింగ్ పర్యవేక్షణ చేయగల సమర్ధ అధికారిని నియామించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగానే గతంలో ఇన్ చార్జీ డీఎంఈగా పనిచేసిన డాక్టర్ వాణిని సూపరింటెండెంట్ గా నియమించినట్లు తెలుస్తున్నది.
Also Read: CRPF: రాహుల్ గాంధీపై సీఆర్‌పీఎఫ్ విమర్శలు.. మల్లికార్జున ఖర్గేకి లేఖ