CRPF: విదేశీ పర్యటనల సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించడం లేదని సీఆర్‌పీఎఫ్ (Central Reserve Police Force ) విమర్శించింది. విదేశాలకు వెళ్లేటప్పుడు ఆయన భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఆర్‌పీఎఫ్ (CRPF) వీవీఐపీ భద్రతా విభాగం చీఫ్ సునీల్ జూనే లేఖ రాశారు. భద్రతను రాహుల్ గాంధీ సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే అత్యధిక విదేశీ పర్యటనలు చేశారని సీఆర్‌పీఎఫ్ ఆరోపించింది.
ఈ లేఖలో రాహుల్ గాంధీ చేసిన పలు విదేశీ పర్యటనల వివరాలను కూడా సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది. ఇటలీ ( 2024 డిసెంబర్ 30 నుంచి జనవరి 9 వరకు), వియత్నాం (మార్చి 12–17), దుబాయ్ (ఏప్రిల్ 17–23), ఖతార్ (జూన్ 11–18), లండన్ (జూన్ 25–జూలై 6), మలేసియాతో పాటు (సెప్టెంబర్ 4–8) ఇతర దేశాల్లోనూ ఇటీవల ఆయన పర్యటించారని పేర్కొంది. ఈ ప్రయాణాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంతో సీఆర్‌పీఎఫ్ యెల్లో బుక్‌లోని భద్రతా నిబంధనలను రాహుల్ గాంధీ ఉల్లంఘిస్తున్నారని లేఖలో సునీల్ పేర్కొన్నారు. ఈ లేఖపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు స్పందించలేదు.
Read Also- Hyderabad Roads: రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు కృషి చేయాలి.. అభయ్ మనోహర్ సప్రే కీలక సూచనలు
రాహుల్ గాంధీ భద్రత కేంద్రంగా చర్చలు జరగడం కొత్తమే కాదు. గతంలోనూ ఇలాంటి పరిణామాలు జరిగాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏఎస్‌ఎల్‌తో (Advanced Security Liaison) పొందుతున్నారు. ఇది అత్యున్నతస్థాయి కేటగిరి భద్రతల్లో ఒకటిగా ఉంది. ఈ భద్రత కింద సుమారు 55 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అందులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు కూడా ఉంటారు. ఏఎస్ఎల్ నిబంధనల ప్రకారం, రాహుల్ గాంధీ వంటి వీఐపీలు వెళ్లే ప్రదేశాలను ముందుగానే గుర్తించి, స్థానిక పోలీస్, ఇంటెలిజెన్స్ యూనిట్లతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు చేస్తారు.
కాగా, రాహుల్ గాంధీకి భద్రత ఉల్లంఘనలపై సీఆర్‌పీఎఫ్ లేఖ రాయడం ఇదే తొలిసారి కాదు. పొందుతున్నారు. 2022లోనూ ఇదే తరహాలో లేఖ రాసింది. 2020 నుంచి 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను అతిక్రమించారని సీఆర్‌పీఎఫ్ పేర్కొంది. భారత్ జోడో యాత్ర ఢిల్లీలో కొనసాగిన సమయంలో కూడా ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొంది.
Read Also- Nepal Interim Government: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎలక్ట్రికల్ ఇంజనీర్.. ఎవరీ కుల్మన్ ఘిసింగ్?
కాగా, రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ కూడా 2023లో ఆరోపించింది. ఆ ఏడాది రాహుల్ గాంధీ కాశ్మీర్ పర్యటనలో భద్రత లోపించిందని, సమయంలో అనూహ్యంగా భారీ జనసందోహం రాహుల్ గాంధీని చుట్టుముట్టిందని, దాదాపు 30 నిమిషాల పాటు ఆయన ఎటూ కదలలేకపోయారని పార్టీ నేతలు చెప్పారు. అయితే, భద్రత విషయంలో సమన్వయం లేకపోవడం, ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతోనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయని సీఆర్‌పీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. సీఆర్‌పీఎఫ్ లేఖపై రాహుల్ గాంధీ స్పందిస్తారో వేచిచూడాలి.