anaconda ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Anaconda: ‘అనకొండ’ మళ్ళీ వచ్చేస్తుంది.. తెలుగు ట్రైలర్ చూశారా?

Anaconda: అనకొండ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 1997 లో వచ్చిన ఈ చిత్రం ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు మళ్లీ మన ముందుకొస్తుంది. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 25, 2025 క్రిస్మస్ కానుకగా మన ముందుకు రానుంది. పాల్ రడ్, జాక్ బ్లాక్, స్టీవ్ జాన్, థాండివే న్యూటన్, డానియేలా మెల్చియోర్, సెల్టన్ మెల్లో నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి టామ్ గోర్మికన్ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా పై ఈ చిత్రం రూపొందుతుంది. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో రానుంది. తెలుగు ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో (యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్) వైరల్‌గా కాగా ..  ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియోట్ చేసింది.

Also Read: Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో రెచ్చిపోతున్న రీతూ.. రొమాన్స్ కోసమే వెళ్ళావా అంటూ.. మండిపడుతున్న నెటిజన్లు!

1997లో రిలీజైన మొదటి అనకొండ చిత్రం హర్రర్-కామెడీ శైలిలో జెన్నిఫర్ లోపెజ్, లూయిస్ లోసా దర్శకత్వం వహించారు. 2004లో వచ్చిన అనకొండ: ది హంట్ ఫర్ ది బ్లడ్ ఆర్చిడ్ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ కొత్త సినిమా గత సినిమాలతో పోలిస్తే కామెడీ, యాక్షన్‌పై ఎక్కువ దృష్టి సారించింది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ ను ఆకట్టుకునేలా రూపొందించబడింది.

Also Read: Boyinapalli Vinodh Kumar: ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల శంకుస్థాపన: వినోద్ కుమార్

కథ ఏంటంటే?

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, డగ్ (జాక్ బ్లాక్), గ్రిఫ్ (పాల్ రడ్), తమ అభిమాన పాత అనకొండ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ ప్రయత్నంలో వారు అమెజాన్ అడవిలోకి వెళ్తారు. అయితే, వారి సరదా ప్రయాణం ఊహించని విధంగా ఒక నిజమైన భారీ అనకొండతో ఎదురవ్వడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి అసాధారణ యోధులుగా మారాల్సి వస్తుంది. ఆ అనకొండతో ఎలా పోరాడారు ? అనేది కథ.

Just In

01

Canara Bank Recruitment 2025 : కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025

OG Premier: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్ షో పడేది ఎప్పుడో తెలుసా?.. ఎక్కడంటే?

Government Complex: ఖాళీగా దర్శనమిస్తున్న మార్కెట్ యార్డ్ ప్రభుత్వ షాపులు.. దృష్టి సారించని అధికారులు

Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?

Accenture Campus: ఏపీకి గుడ్ న్యూస్.. 12వేల ఉద్యోగాలతో.. టాప్ గ్లోబల్ కంపెనీ వచ్చేస్తోంది!