Dharmendra Health Update: ఫేక్ పోస్టలపై భార్య ఆగ్రహం
Dharmendra ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Dharmendra Health Update: బతికి ఉండగానే చంపేస్తారా? మీడియాపై ధర్మేంద్ర కుమార్తె ఇషా, భార్య హేమామాలిని ఫైర్

Dharmendra Health Update: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో వెంట్ లేటర్ సపోర్ట్‌పై ఉన్నారు. నవంబర్ 1న ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉన్న ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు స్పష్టత ఇచ్చారు.

అయితే, సోషల్ మీడియాలో ధర్మేంద్ర ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలు కుటుంబాన్ని తీవ్రంగా కలవరపరచాయి. దాంతో ఆయన కుమార్తె, నటి ఈషా దియోల్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆమె తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. “మీడియా అతి వేగంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది. నాన్న గారు స్థిరంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. మా కుటుంబానికి కొంత గోప్యత ఇవ్వండి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అని చెప్పింది.

Also Read: Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులు.. పుల్వామా వ్యక్తికి నకిలీ పత్రాలతో కార్ విక్రయం

ఫేక్ వార్తలపై  హేమా మాలిని ఆగ్రహం వ్యక్తం

ధర్మేంద్ర భార్య, నటి హేమా మాలిని కూడా తప్పుడు వార్తలపై తీవ్రంగా స్పందించారు. ఆమె తన X ( ట్విట్టర్)లో ఇలా రాశారు. “ ఇది మంచి పని కాదు. ఒక వ్యక్తి చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న సమయంలో, బాధ్యత గల మీడియా సంస్థలు ఇలా తప్పుడు వార్తలు ఎలా ప్రచారం చేస్తాయి? ఇది చాలా అవమానకరం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం. దయచేసి మా కుటుంబ గోప్యతను గౌరవించండి.” అంటూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై మండిపడింది.

Also Read: National Education Day 2025: నేషనల్ ఎడ్యుకేషన్ డే.. మన దేశంలో ఈ రోజు ఎందుకు అంత ముఖ్యమో తెలుసా?

సన్నీ దియోల్ టీమ్ అప్డేట్

ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీ దియోల్ టీమ్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. “ ధర్మేంద్ర స్థిరంగా ఉన్నారు, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరిన్ని వివరాలు మీతో పంచుకుంటాం. దయచేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి, కుటుంబ గోప్యతను గౌరవించండి, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి,” అని పేర్కొన్నారు.

Also Read: Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. డాక్టర్‌ ఉమర్‌ ఫోటోతో కొత్త ఆధారాలు వెలుగులోకి

 

Just In

01

Xiaomi Launch: అల్ట్రా ఫీచర్లతో Xiaomi 17 Ultra లాంచ్

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!