Red Fort Blast ( Image Source: Twitter)
జాతీయం

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. డాక్టర్‌ ఉమర్‌ ఫోటోతో కొత్త ఆధారాలు వెలుగులోకి

Delhi Red Fort Blast: ఢిల్లీ రెడ్‌ఫోర్ట్‌ పేలుడు కేసులో కీలక మలుపు తిరిగింది. భయంకర ఘటన వెనుక ఉన్న ప్రధాన నిందితుడిగా డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌ని పోలీసులు గుర్తించారు. ఆయనే పేలుడు పదార్థాలతో నిండిన కారు నడిపిన ఆత్మాహుతి దాడిదారుగా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.

Also Read: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం.. సాయంత్రం 6 గంటల్లోపు వస్తేనే ఓటింగ్ కు ఛాన్స్!

సోమవారం సాయంత్రం రెడ్‌ఫోర్ట్‌ సమీపంలోని సుబాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుపు రంగు హ్యుందాయ్ i20 కారులో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు నింపినట్లు అధికారులు తెలిపారు. ఈ కారు ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడుతో ధ్వంసమై, మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Smart Phone : ఐక్యూఓఓ 15 యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. 5 ఏళ్ల OS అప్‌డేట్‌, 7 ఏళ్ల సెక్యూరిటీ అష్యూరెన్స్ ప్రకటించిన కంపెనీ!

దర్యాప్తు సంస్థలు తాజాగా నిందితుడి తొలి ఫోటోను స్వాధీనం చేసుకున్నాయి. ఆ ఫోటోలో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని గుర్తించబడిన వ్యక్తి కనిపిస్తున్నట్లు సమాచారం. ఆయనే పేలుడు జరిగిన హ్యుందాయ్ i20 యజమాని అని అధికారులు నిర్ధారించారు. సూక్ష్మంగా పరిశీలిస్తున్న ఫోరెన్సిక్‌ బృందాలు కారు అవశేషాలు, సీసీటీవీ ఫుటేజ్‌, కాల్‌ రికార్డుల ఆధారంగా కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. భద్రతా సంస్థలు ఈ ఘటన వెనుక ఉన్న నెట్‌వర్క్‌ అంతా గుర్తించేందుకు విస్తృత ఆపరేషన్‌ ప్రారంభించాయి. పోలీసులు ఇప్పటివరకు ఇది ప్రణాళికాబద్ధమైన ఆత్మాహుతి దాడి అని భావిస్తున్నారు. ఎర్ర కోట వద్ద జరిగిన పేలుడు కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

Also Read: Free Gemini Pro Offer: భారీ గుడ్ న్యూస్.. జియో కస్టమర్లకు గూగుల్ జెమినీ ప్రో ఫ్రీ యాక్సెస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

Just In

01

Gold Price Today: ఒక్క రోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్? ఈ దెబ్బతో ఇక బంగారం కొనలేరేమో ..?

Jubliee Hills Bypoll Live Updates: ప్రశాంతంగా జూబ్లీహిల్స్ పోలింగ్.. ఓటు వేసిన ప్రధాన అభ్యర్థులు

Hydraa: పార్కులను నామరూపాలు లేకుండా చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి సార్..!

Treatment Rates: ప్రైవేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై సర్కారు స్క్రీనింగ్.. ట్రీట్మెంట్ రేట్లన్నీ ఒకేలా ఉండేలా ప్లాన్!

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు మిస్టరీని ఛేదిస్తున్న పోలీసులు.. పుల్వామా వ్యక్తికి నకిలీ పత్రాలతో కార్ విక్రయం