Smart Phone : ఐక్యూఓఓ సంస్థ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐక్యూఓఓ 15 కోసం సాఫ్ట్‌వేర్ సపోర్ట్ విషయంలో పెద్ద నిర్ణయమే తీసుకుంది. దీంతో, ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. తమ వినియోగదారుల కోసం 5 ఏళ్ల OS అప్‌డేట్, 7 ఏళ్ల సెక్యూరిటీ అష్యూరెన్స్ ను కంపెనీ ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే వినియోగదారులు ఎగిరిగంతేస్తున్నారు. ఎందుకంటే వారికీ భారీ బెనిఫిట్ ఉండబోతుంది. ఇది ఇప్పటివరకు ఐక్యూఓఓ సిరీస్‌లోనే కాకుండా మొత్తం ఆండ్రాయిడ్ మార్కెట్లో కూడా ముందడుగు వేసినట్లు. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, ఈ నిర్ణయం వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తీసుకున్నది. అంతే కాదు, సపోర్ట్ పై ఐక్యూఓఓ మరింత దృష్టి పెట్టిందని తెలిపింది.
iQOO మార్కెట్లో ముందంజ..
ప్రస్తుతం చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్లు గరిష్ఠంగా 4 ఏళ్ల OS అప్‌డేట్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ సపోర్ట్ మాత్రమే ఇస్తున్నాయి. అయితే ఐక్యూఓఓ ఈ పరిమితిని దాటుతూ, ఐదు, ఏడూ సంవత్సరాల సపోర్ట్ అందించడం వలన యూజర్‌ల నమ్మకాన్ని గెల్చుకోవాలనే ప్లాన్ లో ఉంది.
వినియోగదారుల అభిప్రాయమే ప్రధాన ఆధారం
ఇది ఐక్యూఓఓ తీసుకున్న వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారిత నిర్ణయంమాత్రమే కాదు. గతంలో ఐక్యూఓఓ 12 మోడల్‌కు మొదట 3 ఏళ్ల OS, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు మాత్రమే ఇవ్వాలని చెప్పినా, తర్వాత దానిని 4 సంవత్సరాల OS, 5 సంవత్సరాల సెక్యూరిటీ సపోర్ట్ గా పెంచింది. అంతేకాదు, అదనంగా, కంపెనీ ఇటీవల OriginOS 6 అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను పరిచయం చేసింది. ఇది పాత FuntouchOS 15 ను భర్తీ చేస్తుంది. కమ్యూనిటీ సూచనల మేరకు iQOO Neo 7, Neo 7 Pro వంటి పాత మోడళ్లను కూడా కొత్త అప్‌డేట్ రోడ్‌మ్యాప్‌లో చేర్చింది.
ఐక్యూఓఓ iQOO 15 లాంచ్ డేట్
తెలిసిన సమాచారం ప్రకారం, iQOO 15 నవంబర్ 26న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ రెండు ఫోన్స్ అట్రాక్టీవ్ రంగులతో లెజెండ్ ( Legend ), ఆల్ఫా ( Alpha) అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే మన ముందుకు రానున్నాయి.
