theft-gone-wrong (Image source Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

Robbery Gone Wrong: దొంగతనం ఒక రిస్క్‌ లాంటిదని చెప్పవచ్చు. విజయవంతంగా పనిపూర్తయ్యిందా సరే.. లేదంటే ఎదురయ్యే పరిస్థితిని ఊహించుకోవడమే కష్టం.. ఎంత పక్కాగా ప్లాన్‌ వేసినా, అదృష్టం కలిసి రాకపోతే దొంగలు డేంజర్‌లో ఇరుకున్నట్టే. టైమ్ బాలేని దొంగలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏదో చేద్దామనుకొని ప్రయత్నించి చిక్కుల్లో చిక్కుకుంటారు. అలాంటి పరిస్థితే ఓ లేడీ దొంగకు ఎదురైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక నగల దుకాణంలో చోరీ చేద్దామని వెళ్లిన ఆమెకు ఊహించని ప్రతికూలత (Robbery Gone Wrong) ఎదురైంది.

జువెలరీ షాప్ యజమాని కళ్లలో కారంకొట్టి దొంగతనం చేయాలని భావించింది. కానీ, ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. పథకం ప్రకారం, ఓ కస్టమర్ మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించింది, ఏదో మాట్లాడుతూ, ఒక్కసారిగా కారంపొడి తీసి ఓనర్ ముఖంవైపు విసిరింది. కానీ, అది అతడి ముఖంపై పడలేదు. విషయాన్ని ఒక్క క్షణంలోనే పసిగట్టిన నగల దుకాణం యజమాని, రెప్పపాటులో తేరుకొని సదరు మహిళా దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. 25 సెకన్లలోనే సుమారుగా 20 సార్లు కొట్టాడు. చెంపలు, చెవులపై పదేపదే బలంగా కొట్టాడు.

Read Also- SSMB29 title glimpse: మూడు నిమిషాల విజువల్ కోసం వంద అడుగుల తెర.. ‘SSMB29’ కోసం ఆమాత్రం ఉంటది..

నవంబర్ 3న పట్టపగలే ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. సదరు మహిళా దొంగ తన ముఖానికి ఒక వస్త్రాన్ని కట్టుకొని షాపులోకి ప్రవేశించినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. కళ్లలో పడకపోయినప్పటికీ షాప్ యజామాని వెంటనే ధైర్యంగా ప్రతిస్పందించినట్టు వీడియోలో కనిపించింది. అహ్మదాబాద్‌లోని రాణిప్ వెజిటెబుల్ మార్కెట్‌కు సమీపంలో జువెలరీ దుకాణంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులకు ఫిర్యాదు చేయని ఓనర్

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగలషాపు యజమాని నిరాకరించాడు. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ మహిళను గుర్తించడానికి దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాణిప్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కేతన్ వ్యాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జువెలరీ యజమాని ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నప్పటికీ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళ ఎవరనేది గుర్తించడానికి దర్యాప్తు మొదలుపెట్టామని వెల్లడించారు. ఫిర్యాదు చేయాలంటూ ప్రోత్సహించడానికి యజమానిని రెండుసార్లు కలిశామని, అయినా ముందుకు రాలేదని తెలిపారు.

Read Also- APSRTC – Google Maps: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గూగుల్ మ్యాప్స్‌లో ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి!

Just In

01

BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?

Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’గా ఎవరో తెలుసా? టీజర్ విడుదల

Heart Attack: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్‌ఎస్ నేత

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రూ.1 కోటికి చేరిన బెట్టింగ్‌లు..?

Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో