Free Gemini Pro Offer: గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌పై జియో సర్‌ప్రైజ్
Free Gemini Pro ( Image Source: Twitter)
బిజినెస్

Free Gemini Pro Offer: భారీ గుడ్ న్యూస్.. జియో కస్టమర్లకు గూగుల్ జెమినీ ప్రో ఫ్రీ యాక్సెస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

Free Gemini Pro Offer: రిలయన్స్ జియో కస్టమర్ల కోసం మరో ప్రత్యేక ఆఫర్‌ను వారి కోసం తీసుకొచ్చింది. అంతే కాదు, దీనిని అధికారికంగా ప్రకటించింది. గూగుల్‌తో కలిసి జియో ఇప్పుడు ఎంపిక చేసిన యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా గూగుల్ జెమిని ప్రో Google Gemini Pro ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ ధర సుమారు రూ.35,100 గా ఉంది. ఇందులో అధునాతన AI టూల్స్‌తో పాటు 2TB క్లౌడ్ స్టోరేజ్ కూడా అందించబడుతుంది. ఈ ఆఫర్‌ను గతేడాది అక్టోబర్ చివర్లో ప్రకటించిన జియో, ఇప్పుడు దాన్ని దశల వారీగా రోల్‌ అవుట్ చేస్తోంది. మై జియో ( MyJio) యాప్‌లో అర్హులైన యూజర్లకు ఆఫర్ నోటిఫికేషన్లు వస్తున్నాయని తెలిసిన సమాచారం.

ఈ ఆఫర్ ఎవరికి లభిస్తుంది?

జియో, గూగుల్ మధ్య ఒప్పందం ప్రకారం, జియో అన్ లిమిటెడ్ 5G ప్లాన్ ఉన్న వినియోగదారులు ఈ ఉచిత జెమిని ప్రో ( Gemini Pro) యాక్సెస్ పొందుతున్నారు. ఇందులో Gemini 2.5 Pro, Nano Banana, Veo 3.1 వంటి AI ఫీచర్లు, గూగుల్ ఒన్ ద్వారా 2TB క్లౌడ్ స్టోరేజ్ ఉన్నాయి.

ప్రస్తుతం మొదటి దశలో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యూజర్లు, అలాగే రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న జియో అన్ లిమిటెడ్ 5G ప్లాన్ ఉన్నవారికి ఈ ఆఫర్ అందిస్తోంది. కొంతమంది యూజర్లు ఇప్పటికే MyJio యాప్‌లో “Pro plan of Google Gemini already active on your number” అనే మెసేజ్ వచ్చినట్లు చెబుతున్నారు. యూజర్లు గూగుల్ వన్ ( Google One ) యాప్‌లో కూడా తమ సబ్‌స్క్రిప్షన్‌ను చెక్ చేయవచ్చు. ఆ యాప్‌లో “Managed by Jio” అని చూపిస్తే, ఆ జెమిని ప్రో ( Gemini Pro) ప్లాన్ జియో ద్వారా యాక్టివ్ అయినట్లు.

Also Read: Bigg Boss Telugu 9 : నామినేషన్లలో రచ్చ రచ్చ.. సహనం కోల్పోయిన రీతూ.. హౌస్ మేట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు

ఈ ఆఫర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే? 

ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి:

1. ముందుగా మై జియో MyJio యాప్ ఓపెన్ చేయండి.
2. హోమ్ స్క్రీన్‌లో గూగుల్ జెమిని (Google Gemini) ఆఫర్ బ్యానర్ కనిపిస్తుంది.
3. “Know more” లేదా “Claim now” బటన్‌పై క్లిక్ చేయండి.
4. గూగుల్ అకౌంట్ (Gmail ID) తో సైన్ ఇన్ చేయండి.

Jio జియో వెబ్ పోర్టల్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ అందుతుంది. వెంటనే జెమిని ప్రో ( Gemini Pro) ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు.

Also Read: Tamil Film Producers Council: కోలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఆదాయ భాగస్వామ్య నమూనాను తప్పనిసరి చేసిన టీఎఫ్‌పీసీ.. ఎందుకంటే?

షరతులు వర్తిస్తాయని మర్చిపోకండి!

1. ఈ ఉచిత ప్లాన్, మీరు జియో అన్ లిమిటెడ్ 5G (Jio Unlimited 5G) ప్లాన్ కొనసాగించినంత వరకు మాత్రమే చెల్లుతుంది.
2. మీరు ప్లాన్ డౌన్‌గ్రేడ్ చేయడం లేదా నెట్‌వర్క్ మార్చడం వల్ల ఈ ఆఫర్ రద్దవుతుంది.
3. రోల్‌అవుట్ దశలవారీగా జరుగుతోంది కాబట్టి, ప్రతి అర్హుడికి ఆఫర్ వేర్వేరు సమయాల్లో పొందుతారు.

ఈ జెమినీ ప్రో ఆఫర్ ద్వారా జియో వినియోగదారులు AI టెక్నాలజీ, క్లౌడ్ స్టోరేజ్, ప్రొడక్టివిటీ టూల్స్‌ను ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో పొందగలరు.

Just In

01

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!