Typhoon Fung Wong ( Image Source: Twitter)
అంతర్జాతీయం

Typhoon Fung Wong: ఫంగ్-వాంగ్ తుఫాన్ బీభత్సం.. ఫిలిప్పీన్స్‌లో భారీ నష్టం.. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Typhoon Fung Wong: ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతాలను ఆదివారం రాత్రి నుండి ఫంగ్-వాంగ్ తుఫాన్ విరుచుకుపడింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పది లక్షలమందిని పైగా ప్రజలను తుఫాన్ తాకే ముందు ఖాళీ చేయించడంతో పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు.

ఆదివారం (నవంబర్ 9) రాత్రి అరోరా ప్రావిన్స్‌లోని డినలుంగన్ తీర పట్టణంలో ఫంగ్-వాంగ్ తుఫాన్‌గా తాకింది. తీవ్ర గాలులు, వర్షాలు, సముద్ర అలలతో దేశ ప్రధాన ద్వీపమైన లుజాన్ ప్రాంతంలోని పలు పట్టణాలను కుదిపేసింది. దీని కారణంగా ఇసాబెలా ప్రావిన్స్‌లోని సాంటియాగో నగరంలో ఇళ్లు దెబ్బతిన్నాయి. వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. “రాత్రంతా గాలులు ఇనుప షీట్లను బలంగా కొట్టడంతో మేము ఒక్క క్షణం కూడా నిద్రపోలేకపోయాం,” అని స్థానికులు చెబుతున్నారు. అంతే కాదు “చుట్టుపక్కల చెట్ల కొమ్మలన్ని విరిగిపోయాయి. ఉదయం ఇంటి బయటికి రాగానే నష్టం ఎంత తీవ్రంగా ఉందో తెలిసింది ” అని అన్నారు.

Also Read: Tamil Film Producers Council: కోలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఆదాయ భాగస్వామ్య నమూనాను తప్పనిసరి చేసిన టీఎఫ్‌పీసీ.. ఎందుకంటే?

తెలిసిన సమాచారం ఈ ఘటనలో ఇప్పటికీ ఇద్దరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారని సివిల్ డిఫెన్స్ విభాగం తెలిపింది. అరోరా వైస్ గవర్నర్ ప్యాట్రిక్ అలెక్సిస్ అంగారా మాట్లాడుతూ, మూడు పట్టణాలు రోడ్లు తెగిపోవడంతో, వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకోలేని స్థితిలో ఉన్నామని వెల్లడించారు. దీనికి సంబంధించిన మరమ్మత్తులు పనులు కొనసాగుతున్నాయి” అని ఆయన అన్నారు.

Also Read: Maganti Legacy Row: జూబ్లీహిల్స్ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మాగంటి గోపినాథ్ తల్లి, కొడుకు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, తుఫాన్ ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రం వైపు కదులుతోంది. తైవాన్ వైపు వంపు తీసుకునే అవకాశం ఉందని, ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు, బలమైన గాలులు, సముద్ర అలలు కొనసాగవచ్చని హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో ఇప్పటి వరకు 400కి పైగా విమానాలను రద్దు చేశామని సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌ను తాకిన 21వ తుఫాన్‌ గా చెబుతున్నారు. గత వారం తాకిన కల్మెగి తుఫాన్‌లో 224 మంది ఫిలిప్పీన్స్‌లో, మరో ఐదుగురు వియత్నాంలో మరణించారు.

Also Read: Stress Relief: మతిమరుపు, ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే, ఈ చిట్కాలు పాటించండి!

Just In

01

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్

Bigg Boss Malayalam Winner: బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 విజేతగా నటి అనుమోల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

Konda Vishweshwar Reddy: పోలింగ్ రోజు వర్షం పడితే పక్కా గెలుపు మాదే: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి