Tamil Film Producers Council: టీఎఫ్‌పీసీ కొత్త రూల్స్ అదిరాయిగా..
tfpc( image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Tamil Film Producers Council: కోలీవుడ్ లో పెద్ద సినిమాలకు ఆదాయ భాగస్వామ్య నమూనాను తప్పనిసరి చేసిన టీఎఫ్‌పీసీ.. ఎందుకంటే?

Tamil Film Producers Council: తమిళ సినీ పరిశ్రమలో ఆర్థిక క్రమశిక్షణను, పారదర్శకతను పెంచేందుకు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాల నిర్మాణంలో ఇకపై ఆదాయ భాగస్వామ్య నమూనా (Revenue-Sharing Model)ను తప్పనిసరి చేస్తూ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంచలన నిర్ణయం రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కుమార్ వంటి అగ్ర తారల సినిమాల నిర్మాణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.

Read also- Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

లాభనష్టాల్లో అగ్ర నటుల భాగస్వామ్యం

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇకపై పెద్ద చిత్రాలకు సంబంధించిన ప్రముఖ నటులు, దర్శకులు, మరియు ప్రధాన టెక్నీషియన్లు తమ పారితోషికాన్ని స్థిరంగా (Fixed Remuneration) కాకుండా, సినిమా లాభాలు మరియు నష్టాలలో భాగస్వామ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే.. థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం, మరియు OTT/శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో ఒడిదుడుకులు ఎదురవుతుండటంతో, నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఆర్థిక భారాన్ని పంచుకోవడం మరియు పరిశ్రమ మనుగడను కాపాడటం TFPC ప్రధాన లక్ష్యంగా ఉంది.

OTT విడుదల విండోల్లో మార్పులు

థియేట్రికల్ ఆదాయాన్ని కాపాడటానికి, OTT విడుదలలకు సమయాన్ని నిర్దేశించారు. అగ్ర నటుల సినిమాలు (రజనీకాంత్, విజయ్, అజిత్ కుమార్, కమల్ హాసన్, ధనుష్, సూర్య, విక్రమ్): 8 వారాల తర్వాతే OTTలో విడుదల చేయాలి. మధ్య స్థాయి నటుల సినిమాలు 6 వారాల తర్వాత. చిన్న బడ్జెట్ సినిమాలు 4 వారాల తర్వాత. ఓటీటీల్లోకి విడుదల చేస్తారు. చిన్న, మధ్య-స్థాయి పెట్టుబడుల సినిమాలకు థియేటర్ల లభ్యతను మెరుగుపరచడానికి, ఫిల్మ్ రిలీజ్ రెగ్యులేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని TFPC నిర్ణయించింది. ఈ కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 250 చిన్న సినిమాలకు థియేటర్లలో స్థానం కల్పించేందుకు కృషి జరుగుతుంది.

Read also-Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో మూవీ ప్రారంభం.. దర్శకుడెవరంటే?

అంతే కాకుండా.. అగ్ర నటులు సాంకేతిక నిపుణులు వెబ్ సిరీస్‌లు/డిజిటల్ ప్రాజెక్టుల కంటే సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని TFPC విజ్ఞప్తి చేసింది. డిజిటల్ కంటెంట్‌కు అతిగా ప్రచారం చేయడం వల్ల సినిమా పట్ల ఆసక్తి తగ్గుతుందని కౌన్సిల్ అభిప్రాయపడింది. యూట్యూబ్ ఛానెళ్లపై ఉక్కుపాదం మోపనుంది. సినిమా విమర్శల పేరుతో హద్దులు దాటి ప్రవర్తించే యూట్యూబ్ ఛానెళ్లపై చట్టపరమైన పారిశ్రామిక చర్యలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. ప్రైవేట్ సంస్థలు నిర్వహించే అవార్డు వేడుకలు, సంగీత కార్యక్రమాలు వంటి వాటికి TFPC సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (SIAA) నుండి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ కొత్త నిబంధనల అమలు తమిళ సినీ పరిశ్రమలో పెను మార్పులకు నాంది పలకనుంది.

Just In

01

Bigg Boss9: ‘ఇమ్మూన్యుల్ ఒక వెదవ.. ఎంత చెప్పినా వినలేదు’.. తనూజ షాకింగ్ కామెంట్స్

SER Voter List: ఆలస్యం కానున్న ఎన్నికలు.. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ‘సర్ అడ్డంకి?

Hyderabad Crime: పిల్లల ముందే ఘోరం.. భార్యకు నిప్పంటించిన భర్త.. అడ్డొచ్చిన కూతుర్ని సైతం..

Phone Tapping: కేసీఆర్​ విచారణకు లైన్​ క్లియర్​.. త్వరలో నోటీసులు!

Crime News: భార్య కొడుకును కిరాతకంగా హత్య చేసి.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం