Bigg Boss Telugu 9 : ఈ వారం నామినేషన్స్ మీ అంచనాలను తల క్రిందులు చేసింది. ఇది చేయడానికి ఐదు నిముషాలు సమయం మాత్రమే ఉందని బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు. ప్రతి వారం నామినేషన్ సమయంలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా ఉంది. ఇక ఈ వారం ప్రోమో రిలీజ్ స్టార్టింగ్ లోనే ఊర మాస్ పాటను డే 64 ప్రోమో 1 రిలీజ్ చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మీరు నామినేట్ చేయాలనుకున్న ఒకర్ని బలమైన మీ కారణాలతో నామినేట్ చేసి అక్కడున్న షవర్ కింద నిలబడాలని టాస్క్ పెట్టాడు. ఇక ఎవరికి వారు నామినేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇమ్మానుయేల్ కొంచం కూడా ఆలోచించకుండా భరణి ని నామినేట్ చేశాడు. మీరెందుకో ఆలోచించి తగ్గుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇక నుంచి కొత్త భరణిని చూస్తారు అనే దాని పైనే మీరు మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. ఆ ఫైర్ మీరు మెల్లి మెల్లిగా వచ్చే కొద్దీ తగ్గించేస్తున్నారంటూ తన రీజన్స్ చెప్పి భరణి ని నామినేట్ చేశాడు. నా కన్నా తనూజ బెటర్ అని నిర్ణయం తీసుకున్నా తప్ప ఇంకేం లేదు అని భరణి అన్నాడు. అసలు మీరెందుకు అవ్వకూడదనేది కూడా ఆలోచించండని ఇమ్మూ అన్నాడు. మీరు ఆ మనిషి కోసం ఎంతలా చేసారో వాళ్ళకి కూడా తెలుసు.
ఇద్దరి, ముగ్గురిని పెట్టుకుని వాళ్ళని గ్యాంగ్ లాగా ఉంచుకుంటావ్, నువ్వు చెప్పింది వాళ్ళు చెయ్యాలి అన్నట్లు ఒక్కొక్కరికి ఒక్కోటి అలా పాయింట్స్ చెప్పి వాళ్ళని ఒక బాణాలను వదిలినట్లు వదిలావ్ అంటూ సహనం కోల్పోయిన రీతూ దివ్య మీద విరుచుకుపడింది. ఇన్ని మాటలు పడ్డాకా ఈ మేడమ్ గారు సైలెంట్ గా ఉంటదా ? అయితే, వాళ్ళందరూ చిన్న పిల్లలా రీతూ , నేను ఎవరికైనా నేను అవుట్ అయినా తర్వాతే సపోర్ట్ చేస్తా .. లేదంటే లాస్ట్ వరకు నేను ఉండాలని కోరుకుంటాను అని దివ్య చెప్పింది. నువ్వు కమెండ్ చేసి ఆర్డర్ చేసి ఆపుతున్నావ్ వాళ్ళని.. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా ఆగు, ఒక్క నిముషం , నేను చెప్తా అంటూ అని మాట్లాడావు అని రీతూ మాటలు కోటలు దాటాయి. నేను చెప్పినప్పుడు వాళ్ళు వింటున్నారంటే నీ ప్రాబ్లెమ్ ఏంటి ? అంటూ దివ్య కూడా మండిపడింది.
