Hyundai Venue 2025: భారత ఆటో మార్కెట్‌లో కొత్త SUVల సునామీ!
Hyundai Venue ( Image Source: Twitter)
బిజినెస్

Hyundai Venue 2025: హ్యుందాయ్ వెన్యూ 2025 ఎంట్రీతో SUV మార్కెట్లో రగడ.. టాటా, మారుతి, కియా, మహీంద్రాకి గట్టి పోటీ ఇస్తుందా?

Hyundai Venue 2025: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్‌-4 మీటర్ల కంపాక్ట్ SUV మార్కెట్ పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఆటో రంగంలోని ప్రముఖ సంస్థలు హ్యుందాయ్, టాటా, మారుతి, మహీంద్రా, కియా మార్కెట్లు అత్యధికంగా అమ్ముతున్న SUV మోడళ్లకు నూతన తరం వెర్షన్లు తీసుకురానున్నారు. ఇందులో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ లాంటి మోడళ్లు ఉండనున్నాయి.

2025 హ్యుందాయ్ వెన్యూ

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ 2025 నవంబర్ 4న అధికారికంగా లాంచ్ చేశారు. ఇది ఇప్పటికే పూర్తిగా రివీల్ అయింది. క్రెటా, పెలిసేడ్ SUV ల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త డిజైన్ ఎలిమెంట్స్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, కొత్త స్టీరింగ్ వీల్, అలాగే లెవల్-2 ADAS సిస్టమ్ తో వస్తోంది.

Also Read: India vs Australia 5th T20: కాసేపట్లో ఐదో టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పులు.. సిరీస్ గెలిచేదెవరు?

టాటా నెక్సాన్ (2027)

రెండవ తరం టాటా నెక్సాన్ కొత్తగా అప్ గ్రేడ్ చేసిన X1 ప్లాట్‌ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది Curvv కాన్సెప్ట్ లుక్‌ను తీసుకోబోతోంది. ప్రస్తుత 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. డీజిల్ వెర్షన్ తిరిగి వస్తుందా అన్నది స్పష్టంగా తెలియలేదు.

Also Read: Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

మారుతి బ్రెజ్జా (2029)

మారుతి సుజుకీ యొక్క కొత్త తరం బ్రెజ్జా తొలిసారిగా హైబ్రిడ్ టెక్నాలజీతో రానుంది. ఇందులో కంపెనీ స్వదేశీ 1.2L, 3-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. హైబ్రిడ్ వెర్షన్ టాప్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

కొత్త మహీంద్రా XUV 3XO – 2028లో

తరువాతి తరం Mahindra XUV 3XO కు Vision X కాన్సెప్ట్‌ నుండి డిజైన్‌ ప్రేరణ లభించనుంది. ఇది NU_IQ ప్లాట్‌ఫామ్‌ పై ఆధారపడి రూపొందించబడుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ అనేక రకాల పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్‌లను సపోర్ట్‌ చేయగలదని సమాచారం.

Also Read: Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్

కొత్త Kia Sonet – 2027లో రీడిజైన్‌ వెర్షన్‌

Kia Sonet పూర్తిగా కొత్త రూపంతో, అధిక నాణ్యత గల ఇంటీరియర్‌తో, మెరుగైన ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుత ఇంజిన్‌ ఆప్షన్‌లే కొనసాగుతాయని సమాచారం. 1.2 లీటర్‌ పెట్రోల్‌, 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌.

Just In

01

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!