Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు జోరుగా సాగుతోంది. నాగార్జున “రణరంగం” అని పేరు పెట్టినా ఇప్పటి వరకు అది కనిపించలేదు. కానీ డ్రామా మాత్రం తగ్గలేదు. ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి, ప్రియా శెట్టి, ఆర్మీ పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్, రాము రాథోడ్ ఉన్నారు. శ్రీజ కూడా నామినేట్ అయినప్పటికీ, కెప్టెన్ డిమోన్ పవన్ తన స్పెషల్ పవర్‌తో ఆమెను సేవ్ చేశాడు. ఆసక్తికరంగా, రీతూ చౌదరి నామినేషన్‌లోకి వెళ్లడానికి కారణం కూడా డిమోన్ పవనే.
Also Read: Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు
కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ అతనికి సపోర్ట్ చేసింది, కానీ ఆమె సంచాలక్‌గా విఫలమైందని, పక్షపాతం చూపిందని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ, డిమోన్ పవన్ రీతూని సేవ్ చేయకుండా శ్రీజను ఎంచుకోవడంతో రీతూ భావోద్వేగానికి గురైంది. రీతూ తన హృదయం గాయపడిందని చెప్పగా, డిమోన్ పవన్ ఆమెను ఓదార్చాడు. “నీవు బలంగా ఉన్నావు, నామినేషన్స్ నుంచి తిరిగి వస్తావు” అని. అయితే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని డిమోన్ అడిగితే, రీతూ తానే వెళ్తానని అంది. ఆ సమయంలో ఇద్దరూ హాస్యంగా మాట్లాడుకుంటూ, హగ్ చేసుకుని జోకులు వేసుకున్నారు. తర్వాత డిమోన్ రీతూకి ఫుడ్ తినిపిస్తూ కనిపించాడు. ఈ కెమెరా దృశ్యాలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
వామ్మో బిగ్ బాస్ హౌస్లో ” వీళ్ల రొమాన్స్ అస్సలు చూడలేకపోతున్నాం” అంటూ కొందరు ట్వీట్ చేస్తుంటే.. అయ్యో అదంతా నిజం కాదు. ” ఇది కేవలం షో కోసమే అలా చేస్తున్నారు” అని అంటున్నారు. ” ఇది నటనా లేక నిజమైన ఎమోషన్స్ ఉన్నాయా?” అని మరికొందరకి కొత్త అనుమానాలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారేమో అని కొందరు భావిస్తున్నారు. అయితే, హౌస్‌మేట్స్ అడిగినప్పుడు రీతూ, డిమోన్ ఇద్దరూ “మా మధ్య ఏమీ లేదు, కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే” అని స్పష్టం చేశారు. కానీ వారి ప్రవర్తన మాత్రం స్నేహానికి మించి ఉంది. మరి, ఇంక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఇది నిజమైన బంధమా, లేక షోలో డ్రామా కోసం నటనా? తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.