Mahabubabad Rally ( IMAGE CREDIT: SETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు

Mahabubabad Rally: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలనీ మహాబాబాద్ (Mahabubabad rally) జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ (Mahabubabad rally) నిర్వహించారు…నిరుద్యోగి గూగులోతు ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్య అతిథులగా DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్, BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు హాజరై మాట్లాడారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని జాబ్ క్యాలెండర్ విడుదల (Job Calendar Release) చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ ప్రకటించిందని ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు.

 Also Read: OG release issue: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకు అక్కడ ఎదురుదెబ్బ!.. ఎందుకంటే?

50 వేల పైగా ఉద్యోగాలు

నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల పైగా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అసలు ఇచ్చింది 5000 కంటే ఎక్కువ ఇవ్వలేదని అన్నారు.. ఒకపక్క విడుదల చేసిన నోటిఫికేషన్లు గ్రూప్ 1&2&3 పోస్టులు సైతం అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలు ఇచ్చి మభ్య పెట్టీ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు… నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉన్న కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో DSFI జాతీయ సహాయ కార్యదర్శి శాంతికుమార్, రాష్ట్ర అధ్యక్షులు బుర్ర వీరభద్రం,గుగులోతు సూర్య ప్రకాష్,పురుషోత్తం యాదవ్,శివ వర్మ,ఎర్ర దిలీప్,యుగంధర్,రమేష్,కిరణ్,ప్రణయ్,శ్రీకాంత్,నిరుద్యోగులు పాల్గొన్నారు.

 Also Read: Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం

Just In

01

OG advance booking: ఆ రికార్డుపై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఈ సారి మనదే అంటున్న ఫ్యాన్స్

Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు

Ponnam Prabhakar: జీఎస్టీ టాక్స్ తో ఏం మంచి పని జరిగింది?.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

OG release: ఉత్తరాంధ్రలో ‘ఓజీ’ బ్యాంగ్ మోగించేందుకు సర్వం సిద్ధం..

Land Encroachment: భూ కబ్జాలపై సర్కార్ షాక్?.. హైడ్రా ఆపరేషన్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి?