Delhi Red Fort Blast: ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఘోర ఘటన చోటుచేసుకుంది. ఎర్ర కోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిపి ఉంచిన కారు ఒక్కసారిగా పేలిపోయి ఎనిమిది మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆరు వాహనాలు, మూడు ఆటోలు మంటల్లో చిక్కుకోగా మొత్తం 24 వాహనాలు దగ్ధమయ్యాయని ఢిల్లీ పోలీస్ లు తెలిపారు.
సాయంత్రం 7 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారులో పేలుడు సంభవించినట్టు సమాచారం. మంటలను ఫైరింగ్ సిబ్బంది తక్షణమే అదుపులోకి తెచ్చారు. ఘటన స్థలానికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు 10 నిమిషాల్లో చేరుకున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
“ రెడ్‌ఫోర్ట్ సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ కారు పేలిపోయింది. కొంతమంది పాదచారులు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కొంతమంది మృతి చెందినట్టు సమాచారం. సమాచారం అందిన పది నిమిషాల్లోనే దర్యాప్తు బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి ” అని అమిత్ షా తెలిపారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సెలబ్రిటీలు
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితుల కుటుంబాలక సినీ ప్రముఖులు సోషల్‌మీడియా సంతాపం తెలిపారు.
నటి రవీనా టాండన్ దుర్ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పోస్ట్‌లో, “ఢిల్లీ పేలుడు ఘటన భయానకంగా ఉంది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం,” అని పేర్కొన్నారు.
Condolences to all those bereaved families who lost their loved ones in the Delhi blast . Horrible news .
— Raveena Tandon (@TandonRaveena) November 10, 2025
నటుడు సోను సూద్ బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రజలను మానవత్వంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రెడ్‌ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడుతో బాధితులందరికీ నా హృదయపూర్వక సంతాపం. మనమంతా ఒకరినొకరం చూసుకోవాలి, శాంతి కోసం కట్టుబడి ఉండాలి,” అని ఆయన రాశారు.
My heart reaches out to everyone impacted by today’s tragic blast near the Red Fort in Delhi. 💔 Let’s support the victims, look out for each other, and commit to peace.
— sonu sood (@SonuSood) November 10, 2025
రిద్దిమా కపూర్ సహ్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితుల కోసం ప్రార్థించారు. “ఢిల్లీ పేలుడు ఘటన మనసును కలచివేసింది. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆశిస్తున్నాను. ప్రార్థనలు మాత్రమే…” అని ఆమె రాసుకొచ్చారు.
అలాగే తమిళగ వెట్రి కజగం పార్టీ నేత విజయ్ ‘X’ (మాజీ ట్విట్టర్)లో స్పందిస్తూ పేలుడుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి త్వరగా ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
