Delhi Car Blast: దేశ రాజధానిలో భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది వరకూ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల అరెస్ట్ జరిగిన నేపథ్యంలో ఈ పేలుడు జరిగినట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. దాడికి తెగబడ్డ వారికి భూటాన్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘ఎవరినీ వదిలి పెట్టం’
రెండ్రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి దిల్లీ పేలుడు ఘటనపై స్పందించారు. ఢిల్లీ కారు పేలుడుకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సూత్రదారులు, పాత్రదారులను వదలబోమని స్పష్టం చేశారు. మూలాల్లోకి వెళ్లి మరి కలుగులో దాక్కున్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతామని అన్నారు. దేశంపై దాడి చేసిన వారికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేలుడు తర్వాత రాత్రంతా పరిస్థిని సమీక్షించినట్లు ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ‘ఇవాళ నేను చాలా బరువెక్కిన హృదయంతో ఇక్కడ ఉన్నాను. నిన్న సాయంత్రం దిల్లీలో జరిగిన దారుణ ఘటన అందరినీ తీవ్రంగా బాధపెట్టింది. బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకున్నాను. ఈ రోజు దేశం మెుత్తం వారితో ఉంది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
#WATCH | Thimphu, Bhutan: On Delhi car blast, PM Narendra Modi says, “…The conspirators behind this will not be spared. All those responsible will be brought to justice.”
“Today, I come here with a very heavy heart. The horrific incident that took place in Delhi yesterday… pic.twitter.com/64aved9Ke1
— ANI (@ANI) November 11, 2025
Also Read: Jubliee Hills Bypoll Live Updates: జూబ్లీహిల్స్ పోలింగ్.. ఎన్నికల అధికారి సీరియస్.. స్థానికేతరులపై కేసులు
సూత్రదారి ఫొటో విడుదల
దిల్లీ కారు బాంబు పేలుడు వెనుక ఫరిదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలు ఉన్న డాక్టర్ ఉమర్ మహ్మద్ కీలక సూత్రదారిగా ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతడి ఫొటోను సైతం విడుదల చేశాయి. శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసిన ఉమర్.. ఫరిదాబాద్ లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఉగ్రవాదులతో సంబంధమున్న పలువురు డాక్టర్లను జమ్ముకాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఫరిదాబాద్ లో ఉంటున్న ఉమర్ పేరు సైతం తెరపైకి వచ్చింది. పెద్ద ఎత్తున డాక్టర్ల అరెస్టు నేపథ్యంలో ఉమర్ ఈ బ్లాస్టుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే పేలుడు జరిగిన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలు లభించగా.. అవి ఉమర్ వా? కావా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
🚨The car owner of Delhi Red Fort Blast has been identified as Dr. Mohammad Umar, a Pulwama-based doctor
Police confirm his charred body has been recovered from the blast site near Delhi’s Red Fort and sent for DNA testing
CCTV shows Umar driving the Hyundai i20 that exploded… pic.twitter.com/kbdiLugZYN
— Nabila Jamal (@nabilajamal_) November 11, 2025
