Amrutham Remastered: సరికొత్తగా మళ్లీ మన ముందుకు ‘అమృతం’
amruthan(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Amrutham Remastered: సరికొత్తగా మళ్లీ మన ముందుకు ‘అమృతం’ సీరియల్.. నవ్వుకోవాలంటే..

Amrutham Remastered: తెలుగు బుల్లితెర చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని హాస్యపు సంతకం ‘అమృతం’. ‘ఒరేయ్ ఆంజనేయలూ…’, ‘సర్వం’, ‘అప్పాజీ’ అనే మాటలు తెలుగువారి జీవనంలో ఒక భాగమైపోయాయి. అమృతం రావు, అంజి, సర్వం, అప్పాజీ – ఈ నలుగురు పాత్రలు సృష్టించిన హాస్యపు సునామీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్లాసిక్ కామెడీ ధారావాహిక అభిమానుల కోసం, అసలైన పాత ‘అమృతం’ ఎపిసోడ్‌లను రీమాస్టర్డ్ చేసి, అత్యుత్తమ నాణ్యతతో మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది నిజంగానే పండగ లాంటి వార్త. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ‘అమృతం’ ధారావాహిక… నవంబర్ 24, 2025 నుండి డిజిటల్ మాధ్యమం ద్వారా మళ్లీ ప్రసారం కానుంది. యూట్యూబ్ వేదికగా రోజుకు రెండు ఎపిసోడ్లు చొప్పున ప్రసారం చేయనున్నారు. అంటే, అభిమానులు ప్రతిరోజు అమృతం, అంజి, సర్వం, అప్పాజీల ఫన్నీ లీలలను డబుల్ డోస్‌లో ఆస్వాదించవచ్చు.

Read also-Manchu Manoj: మంచు మనోజ్ మరో కొత్త ప్రయాణం ‘మోహన రాగ’ మ్యూజిక్ లేబుల్.. నాన్నకు ప్రేమతో!

నాణ్యత మెరుగుపడింది

2001లో ప్రారంభమై ఆరు సంవత్సరాలు విజయవంతంగా ప్రసారమైన ఈ సీరియల్‌కు ఉన్న ఒకే ఒక్క లోపం పాత నాణ్యతతో కూడిన వీడియో. ఇప్పుడు ఆ లోపం కూడా తీరిపోయింది. ఒరిజినల్ ఎపిసోడ్‌లను ఆధునిక సాంకేతికతతో రీమాస్టర్డ్ (నాణ్యత మెరుగుపరచడం) చేయడం వల్ల, టీవీలో చూసిన అనుభూతిని మించి, మెరుగైన క్లారిటీతో, అద్భుతమైన విజువల్స్‌తో ఈ ఎపిసోడ్‌లను మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలలో చూడవచ్చు. ఇది పాత అభిమానులకు, కొత్తగా చూడాలనుకునే వారికి కూడా చక్కటి అవకాశం. అప్పట్లో ఈ సీరియల్ కోసం వారం రోజులు పాటు వెయిట్ చేసేవారు. అమృతం అంటే అప్పటి వారికి ఒక ఎమోషన్ లాంటిది. అలాంటి సీరియల్ మళ్లీ ప్రసారం అవడంతో 90ల నాటి ఆడియన్స్ సీరియల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-VC Sajjanar: సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్‌మీట్​ ఏంటి? సామాన్యులతో ఇలా ఎప్పుడైనా మీడియాతో మాట్లాడారా?

ఎప్పటికీ క్లాసిక్!

గుణ్ణం గంగరాజు సృష్టించిన ఈ కామెడీ సిట్‌కామ్.. కేవలం హాస్యం కోసమే కాకుండా, మధ్యతరగతి జీవితంలోని సమస్యలను, చిన్న చిన్న ఆశలను, వాటి చుట్టూ అల్లుకున్న అమాయకత్వాన్ని అద్భుతంగా చూపించింది. శివాజీ రాజా, నరేష్, హర్ష వర్ధన్ (అమృతం), గుండు హనుమంత రావు, ఎల్.బి. శ్రీరామ్ (అంజి), వాసు ఇంటూరి (సర్వం), శివన్నారాయణ (అప్పాజీ) వంటి నటుల అద్భుతమైన నటన, వారి కామిక్ టైమింగ్ ఈ సీరియల్‌ను ఒక కళాఖండంగా మార్చాయి. ‘అమృతం’ సీరియల్ ద్వితీయం వచ్చినా, పాత ఎపిసోడ్‌లను రీమాస్టర్డ్ చేసి చూడటం అనేది నిజమైన అభిమానులకు ఒక మధురమైన అనుభవం. ఈ నవంబర్ 24 నుండి, మీ రోజువారీ పనుల మధ్యలో రెండు ఎపిసోడ్‌లు చూసి, కడుపుబ్బా నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి.

Just In

01

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

New Sarpanch: ఎలుగుబంటి వేషంలో నూతన సర్పంచ్.. కోతుల సమస్యకు చెక్!