Amaravathiki Ahwanam: ‘అమరావతికి ఆహ్వానం’ అనగానే ఏదేదో ఊహించుకుంటారేమో.. అదేం లేదు. ఈ టైటిల్‌తో ఇప్పుడో సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం హారర్ సినిమాల హవా బాగా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన అన్నీ హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాగ్జిమమ్ భారీ సక్సెస్ కొట్టాయి. ఇప్పుడదే తరహాలో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ప్రేక్షకులకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిచ్చేలా రూపుదిద్దుకుంటోన్న చిత్రమే ‘అమరావతికి ఆహ్వానం’ (Amaravathiki Ahwanam). ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ తర్వాత మంచి ఆదరణ లభించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. శివ కంఠంనేని (Siva Kantamneni), ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna), ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలతో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ వంటివారు కీలకపాత్రలు పోస్తున్నారు.
Also Read- Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి.. లేదంటే నేనే నింద మోయాలి!
క్రిస్మస్ స్పెషల్‌గా..
డైరెక్టర్ జివికె రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో, జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్‌లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. అతి త్వరలో భారీగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్‌ను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ న్యూ పోస్టర్, గ్లింప్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్, గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.
Also Read- Bigg Boss9: ‘ఇమ్మానుయేల్ ఒక వెధవ.. ఎంత చెప్పినా వినలేదు’.. తనూజ షాకింగ్ కామెంట్స్
సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతినిస్తుంది
ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా మూవీ టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ధన్య, ఎస్తర్, సుప్రిత వంటి మంచి క్యాస్టింగ్‌తో పాటు పలువురు సీనియర్ నటీనటులు మంచి పాత్రలు చేశారు. దర్శకుడు జీవికే తన విజన్‌తో ఈ సినిమాకు మంచి ఔట్‌పుట్ తీసుకువచ్చారు. ఇందులో అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తప్పకుండా ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతినిస్తుందని అన్నారు. దర్శకుడు జివికె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో రిలీజైన అన్ని హారర్ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. వాటన్నింటిని మించేలా, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారు. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నాం. రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

