Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్ ఇదే..
Srinivasa Mangapuram (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఏంటీ స్పీడూ?

Srinivasa Mangapuram: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘ఘట్టమనేని’ కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) లెగసీని మహేష్ బాబు అగ్రస్థానంలో నిలబెట్టగా, ఇప్పుడు అదే కుటుంబం నుండి మరో యువకెరటం వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన దివంగత రమేష్ బాబు (Ramesh Babu) కుమారుడు, మరో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ఎలా వార్తలో ఉంటుందో తెలియంది కాదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే..

Also Read- Shambhala: ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘శంబాల’.. ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ వదిలారు

ముగిసిన 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్

ఈ భారీ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్ 30 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మధ్యప్రదేశ్‌లోని అందమైన లోకేషన్లు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో ఈ చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఇందులో ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలతో పాటు, అద్భుతమైన పాటలు, ముఖ్యమైన టాకీ పార్ట్‌ను కూడా షూట్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది. ఇంత స్పీడ్‌గా చిత్రీకరణ జరుపుతున్నారా? ఒక్క నెలలోనే 30 శాతం షూటింగ్ అంటే ఇది మాములు స్పీడ్ కాదనేలా కామెంట్స్ పడుతున్నాయి.

Also Read- Students Boycott Classes: ప్రిన్సిపాల్ వేధింపులు.. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి దూరి.. విద్యార్థినులతో అసభ్యంగా..

రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ

‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న విజనరీ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణను ఒక ‘రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీ’ ద్వారా ఆయన వెండితెరకు పరిచయం చేస్తుండటం విశేషం. మరో విశేషమేమిటంటే, టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ (వైజయంతి మూవీస్) ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌ పట్ల చిత్ర బృందం పూర్తి సంతృప్తిగా ఉన్నట్లుగా ఈ అప్డేట్‌లో తెలిపారు. త్వరలోనే జయకృష్ణ లుక్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని (Rasha Thadani) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ramchander Rao: వీర్ సాహిబ్జాదే వీర మరణం చరిత్రలో ప్రేరణాత్మకం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు!

MP Chamala Kiran: దమ్ముంటే ఆ పనిచెయ్యి.. కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాలు

Raja Singh: బీజేపీలోకి రాజాసింగ్? భవిష్యత్ లేకనే తిరిగి గూటికి చేరుతున్నారా?

Shekar Basha: కిలిమంజారో.. తోపు పాయింట్ లాగి, చిన్మయికి షాకిచ్చిన శేఖర్ భాషా!

Accreditation Guidelines: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ మార్గదర్శకాలపై మీడియా అకాడమీ చైర్మన్ స్పందన