Students Boycott Classes: హాస్టల్లోకి వెళ్లి ప్రిన్సిపాల్ వేధింపులు
Students Boycott Classes (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

Students Boycott Classes: ప్రిన్సిపాల్ వేధింపులు.. అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి దూరి.. విద్యార్థినులతో అసభ్యంగా..

Students Boycott Classes: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రిన్సిపాల్ మురళీకృష్ణ వేధింపులకు వ్యతిరేకంగా ఎంఎస్ఎంఈ కాలేజీ (MSME College) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. అర్థరాత్రి విద్యార్థినుల వసతి గృహాల్లోకి వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, డీజీఎం ప్రసాద్ రెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తరగతులను బహిష్కరించారు.

ప్రిన్సిపల్ వేధింపులు, బెదిరింపులకు వ్యతిరేకంగా గత శనివారమే (డిసెంబర్ 20) కళాశాల ఆవరణలో ధర్నా చేసినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ నుంచి తమకు ఎదురైన ఛేదు అనుభవాలను ఆరోజు చెప్పుకొని బాధపడ్డారని పేర్కొన్నారు. అయితే ధర్నా రోజున ఎవరైతే ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా మాట్లాడారో.. వారికి సస్పెండ్ నోటీసులు జారీ అయినట్లు విద్యార్థులు ఆరోపించారు.

Also Read: Psycho Hulchul: తిరుమలలో సైకో హల్‌చల్.. చిన్నారుల వెంటపడుతూ.. చంపేస్తానని బెదిరింపులు

ఆ రోజు తమకు అండగా వచ్చేందుకు యత్నించిన విద్యార్థి సంఘం నేతలను సైతం పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరించారని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత శనివారం ధర్నా సందర్భంగా కాలేజీ యాజమాన్యం వచ్చి ఇకపై మీకు ఎలాంటి సమస్యలు ఉండవని హామీ ఇచ్చిందని చెప్పారు. దీంతో అది నిజమని భావించి.. ఆందోళనలను విరమించినట్లు పేర్కొన్నారు. తీరా ఆ మర్నాడే ఉదయం 10 గంటలకు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు రివర్స్ లో తమపై బెదిరింపులకు దిగుతున్నారని విద్యార్థులు వాపోయారు. తమ సస్పెన్షన్ తొలగించే వరకూ ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

Also Read: CM Chandrababu: రప్పా రప్పా చేస్తారా.. బాబాయ్‌ని లేపేసి నింద వేస్తారా.. సీఎం చంద్రబాబు వైల్డ్ ఫైర్

Just In

01

GHMC: జీహెచ్ఎంసీలో మరోసారి అంతర్గత మార్పులు.. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఛాన్స్?

Brave boy Sravan: ఆపరేషన్ సింధూర్‌లో సైనికులకు సాయం.. 10 ఏళ్ల బాలుడికి ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారం

Medaram Temple: ప్రతి చిహ్నానికి ఆదివాసీ చరిత్రే ఆధారం.. నమస్తే తెలంగాణ కథనంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం!

Seethakka: కనివిని ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ మహా జాతర.. మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి!

Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఏంటీ స్పీడూ?