Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి...
Sivaji Actor (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sivaji: వ్యక్తిగత విషయాలు వదిలేసి ‘దండోరా’ను హిట్ చేయండి.. లేదంటే నేనే నింద మోయాలి!

Sivaji: లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించిన తాజా చిత్రం ‘దండోరా’ (Dhandoraa). శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నాన్ కాంట్రవర్సీయల్ సక్సెస్ మీట్ (Dhandoraa Non Controversial Success Meet) పేరిట మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాజీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం రేగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని నాన్ కాంట్రవర్సీయల్ ప్రెస్ మీట్ అని మేకర్స్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.

Also Read- Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

2026 మొత్తం మాట్లాడుకుంటారు

ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ (Sivaji) మాట్లాడుతూ.. ‘‘హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయ‌టానికి వ‌చ్చారు. నా దర్శకుడు నీల‌కంఠ‌ ఈ సినిమా చూసి త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు. రెండు రోజుల ముందు ప్రీమియర్స్ పడి ఉంటే, ఈ సినిమా పరిస్థితి వేరేలా ఉండేది. సెన్సార్ వల్ల డిలే అయ్యింది. ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. నార్త్ అమెరికాలో షోలు బాగా పెరిగాయి. ఒక థియేటర్‌లో ఒక షో పెట్టిన‌వాళ్లు.. మూడు షోస్‌కు పెంచారు. మ‌ల‌యాళ సినిమా డైరెక్ట‌ర్స్‌, మారి సెల్వ‌రాజ్ వంటి డైరెక్ట‌ర్‌తో పోల్చి ముర‌ళీకాంత్ గురించి మాట్లాడుతున్నారంటే.. నిజంగా మాకు చాలా గ‌ర్వంగా ఉంది. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ చూస్తే.. తెలుగులో అద్భుత‌మైన న‌టులు వ‌స్తున్నార‌ని చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఇందులోని ప్ర‌తీ పాత్ర బాగా కుదిరింది. ఈ సినిమా షూటింగ్ చేస్తునన్ని రోజులూ నేను రోజుకి 2 గంట‌లే ప‌డుకునేవాడిని. ఇందులో నాకు కొడుకు, కూతురు ఇలా చాలా పాత్ర‌లుంటాయి. అందుకే కొంచెం ముఖం వాచినట్లుగా ఉండాలని నిద్రపోలేదు. నా పాత్రను బ్యాలెన్స్ చేయాలంటే ఆ లుక్ క‌నిపించాలి. డైరెక్ట‌ర్ అడ‌గ‌క‌పోయినా నేనే ఆ నిర్ణయం తీసుకున్నాను.

Also Read- Karate Kalyani: అనసూయను ‘ఆంటీ’ అని కాకుండా ‘స్వీట్ 16 పాప’ అని పిలవాలా?

నిందను నేను మోయాల్సి వస్తుంది

అంద‌రూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. అంద‌రూ ఈ సినిమాను భుజాల‌కెత్తుకున్నారు. లాంగ్ ర‌న్‌తో అంద‌రూ మాట్లాడుకునేలా చేస్తుందీ సినిమా. ఇంక ఏమున్నా వదిలేయండి. దయచేసి ఈ సినిమా విషయంలో నా వ్యక్తిగత విషయాల జోలికి పోవద్దు. అది నేను సపరేట్‌గా చూసుకుంటాను. అందరం కలిసి దానిపై మాట్లాడుకుందాం. దయచేసి ఈ సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే, ఆ నిందను నేను మోయాల్సి వస్తుంది. కాబట్టి, ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి. ఇంకా అవే పట్టుకుంటే నిర్మాత పరిస్థితి వేరేలా ఉంటుంది. థియేట‌ర్స్‌కు వచ్చి ఆడియెన్స్‌తో కూడా నేరుగా మాట్లాడుతాను. మంచి సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నిర్మాత‌ నిలబడి ఇంకో పది సినిమాలు చేసేలా సపోర్ట్ చేయండి’’ అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Seethakka: కనివిని ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ మహా జాతర.. మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి!

Srinivasa Mangapuram: ఘట్టమనేని వారసుడి సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఏంటీ స్పీడూ?

Shambhala: ఆది కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘శంబాల’.. ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ వదిలారు

Terrorist In Market: మార్కెట్‌లో కనిపించిన ఉగ్రవాది.. రంగంలోకి దిగిన సీఆర్‌పీఎఫ్ బలగాలు

Srinivas Goud: మేడిగడ్డ బ్యారేజీని ఎందుకు రిపేర్ చేయట్లేదు? : మాజీ మంత్రి  శ్రీనివాస్ గౌడ్!