Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. దొరికేసిన రివ్యూయర్!
Vamsi Nandipati (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

Eesha Movie: ఈ మధ్యకాలంలో సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. సినిమా ఎలా ఉందనే విషయం కూడా తెలుసుకోకుండా, ఏదో ఒకటి వాళ్లకి నచ్చిన రేటింగ్ ఇచ్చి, సినిమాను కిల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో, సినిమాపై బతికే వారు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సరే విషయంలోకి వస్తే, డిసెంబర్ 25న విడుదలైన సినిమాలలో ‘ఈషా’ మూవీ (Eesha Movie) పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాకు సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చే ఓ పర్సన్.. సినిమా విడుదల కాకుండానే రివ్యూ ఇవ్వడంతో, చిత్ర నిర్మాతలలో ఒకరైన వంశీ నందిపాటి ఫైరయ్యారు. సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చిన వ్యక్తికే కొన్ని ప్రశ్నలు సంధించగా, ఆ వ్యక్తి.. సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చినట్లుగా ఓపెన్ అయిపోయి.. అడ్డంగా బుక్కయ్యాడు. ఇదే విషయాన్ని గురువారం జరిగిన సక్సెస్ మీట్‌లో కూడా సదరు నిర్మాత చెప్పి, అలాంటి వారికి వార్నింగ్ ఇచ్చారు.

Also Read- Karate Kalyani: అనసూయను ‘ఆంటీ’ అని కాకుండా ‘స్వీట్ 16 పాప’ అని పిలవాలా?

సినిమా యుఎస్‌లోనే విడుదల కాలేదు.. కానీ!

ఈ కార్యక్రమంలో వంశీ నందిపాటి (Vamsi Nandipati) మాట్లాడుతూ.. ‘ఈషా’ సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతున్నారు. హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సినిమా థియేటర్లలో నడుస్తుంది. అలాంటిది, అసలు సినిమా విడుదల కాకుండా ఇక్కడున్న ఒకరు నెగిటివ్ రివ్యూ ఇచ్చేశారు. ఆ పర్సన్‌ని గట్టిగా అడిగితే, ముందు యుఎస్ అన్నాడు. అసలీ సినిమా యుఎస్‌లో విడుదల కాలేదు.. మరి ఎలా ఇచ్చారంటే.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చూసి చెప్పారని అన్నాడు. అంటే, సినిమా చూడకుండానే, ఎవరో చెప్పినదాన్ని తీసుకుని పేరాలకు పేరాలు రివ్యూ అంటూ రాసేసి, నచ్చిన రేటింగ్ వేసేసి సినిమాను చంపేయాలని చూశారంటే, ఎంత కుట్రతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఎన్ని చేసినా, ప్రేక్షకులు జడ్జిమెంట్ అంటూ ఒకటి ఉంటుంది. మేము ఎవరికీ హనీ కూడా చేయలేదు. ఎవరు ఇలా చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో.. ఇలాంటి పనులు ఆపితే మంచింది. సినిమాకు థియేటర్లలన్నీ హౌస్‌ ఫుల్‌గా నడుస్తున్నాయి. సినిమా బాగుందని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది. ఇంకెన్నాళ్లు మీ ఆటలు సాగుతాయిని అనుకుంటున్నారంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.

Also Read- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు

ఇంత నీచంగా దిగజారాలా?

ఇక ఈ సినిమాను సమర్పించిన నిర్మాత దామోదర్ ప్రసాద్ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కావాలని ఇళ్లల్లో రెండు, మూడు గదుల్లో 10 నుంచి 20 వరకు కంప్యూటర్లు పెట్టుకుని, మనుషులను పెట్టుకుని మరీ నెగిటివ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారు. ఎందుకివన్నీ.. ఇది వ్యాపారం చేసే లక్షణం కాదు. మరీ ఇంత నీచంగా దిగజారాలా? నీ సినిమాను నువ్వు ప్రమోట్ చేసుకో.. వేరే వాళ్ల సినిమాలతో నీకెందుకు? ఇకనైనా ఇలాంటివి మానుకోండి. నేను గట్టిగా తలుచుకుంటే మీ కెరీర్ ఇంతటితో ముగిసిపోతుంది.. జాగ్రత్త! అంటూ దామోదర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు అన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Eesha Movie: యుఎస్‌లో రిలీజ్ కాకుండానే ఫేక్ రివ్యూ.. నిర్మాతకు దొరికేసిన రివ్యూయర్!

Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

Vilaya Thandavam: యాక్షన్ మోడ్‌లో కార్తీక్ రాజు.. ‘విలయ తాండవం’ లుక్ అదిరింది

Suryapet News: పిల్లర్లు తడుపుతూ కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకు మృత్యువాత.. తీవ్ర విషాదం

Jetlee Movie: వెన్నెల కిషోర్ ‘సుడోకు’ ఫన్.. ‘జెట్లీ’ స్టైలిష్ ఫస్ట్ లుక్ విడుదల