Brave boy Sravan: సైనికులకు సాయం.. బాలుడికి కేంద్రం అవార్డ్
Sravan-Singh (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Brave boy Sravan: ఆపరేషన్ సింధూర్‌లో సైనికులకు సాయం.. 10 ఏళ్ల బాలుడికి ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారం

Brave boy Sravan: యుద్ధం అంటే బాంబులు, తుపాకుల మోత. అదొక భయంకరమైన వాతావరణం. రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తితే  సరిహద్దు ప్రాంతాల్లో నివసించే జనాలు ప్రాణభయంతో వణికిపోవాల్సిందే. క్షణమొక యుగంలా గడపాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత సైనిక సంఘర్షణ సమయంలో సరిహద్దుల్లో దాదాపుగా ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో మోహరించి, దాయాది దేశం తోకముడిచేలా చేశాయి. అయితే, ఇరుదేశాల మధ్య జరిగిన ఈ సైనిక సంఘర్షణలో కేవలం 10 ఏళ్ల వయసున్న ఓ బాలుడు భారత సైనికులకు సాయం చేశాడు. ఆటపాటలు, లేదా భయపడాల్సిన ఆ వయసులో శ్రవణ్ సింగ్ అనే బుడ్డోడు అసాధారణ ధైర్యసాహసాలు (Brave boy Sravan) ప్రదర్శించాడు.

ప్రతిరోజూ సాయం

ఇండియన్ ఆర్మీ సరిహద్దులోని ఫార్వర్డ్ ఏరియాలో మోహరించి ఉండగా, ప్రాణాంతకమైన ఆ పరిస్థితుల్లో శ్రవణ్ ప్రతిరోజూ మంచినీళ్లు, పాలు, లస్సీ, టీ, ఐస్‌లను తీసుకెళ్లి సైనికులకు అందించాడు. ఇలా సైన్యం అక్కడ మోహరించి ఉన్నన్ని రోజులు ఏదో ఒకటి తీసుకెళ్లి ఇస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే, బలగాలకు ఒక నమ్మకమైన సపోర్ట్ సిస్టమ్‌గా సేవలు అందించాడు. శ్రవణ్‌ను చూసి తాము మరింత నైతిక ధైర్యాన్ని పొందామని ఆర్మీ అధికారులు చెప్పారంటే, ఎంత విలువైన సాయం చేశాడో అర్థం చేసుకోవచ్చు. అంతచిన్న వయసులో అసాధాణ ధైర్యం, మరోవైపు అనంతమైన దేశభక్తి ప్రదర్శించిన చిన్నారి శ్రవణ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఘనంగా సత్కరించింది. ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ (PMRBP) అవార్డును ప్రకటించగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ (డిసెంబర్ 26) ప్రదానం చేశారు. కాగా, శ్రవణ్‌ను ఆర్మీ అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశంసించారు. చిన్నారి చదువుకు అయ్యే ఖర్చులను భరించాలని ఆర్మీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

Read Also- Seethakka: కనివిని ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ మహా జాతర.. మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి!

ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక, సైనికులు మా గ్రామానికి వచ్చారు. పాకిస్థాన్‌తో యుద్దం జరుగుతోంది. సైనికులు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. అందుకే, వారికి సాయం చేయాలని నేను అనుకున్నాను. అందుకే, ప్రతిరోజూ పాలు, టీ, లస్సీ, ఐస్‌లు తీసుకెళ్లి ఇచ్చేవాడిని. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ స్వీకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. అవార్డ్ వస్తుందని నేను కనీసం కలలో కూడా అనుకోలేదు’’ అని పురస్కారం స్వీకరించే సందర్బంగా శ్రవణ్ సింగ్ చెప్పాడు.

Read Also- Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్‌లకు తగిన గౌరవం దక్కుతుంది : మంత్రి సీతక్క

Just In

01

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!

Jana Nayagan: మరో పాట వదిలారు.. నో డౌట్ ‘భగవంత్ కేసరి’ రీమేకే!

Amith Shah: ఢిల్లీ పేలుడు ఘటనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Jadcherla Politics: కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన 150 మంది నాయకులు!

Ramchander Rao: వీర్ సాహిబ్జాదే వీర మరణం చరిత్రలో ప్రేరణాత్మకం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు!