Seethakka: సర్పంచులను , ఉప సర్పంచులను,వార్డు సభ్యులను ఇచార్జీలన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క (Seethakka) ఆత్మీయంగా సత్కరించారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో నూతనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్ ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. కొత్తగూడ, గంగారం మండలంలో సర్పంచ్ల గెలుపులకు కృషిచేసిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, రెండు మండలాలకు ఇంచార్జీలుగా ఉన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య, కుంజా కుసుమాంజలి, స్టేట్ డైరెక్టర్ చల్ల నారాయణ రెడ్డి గారికి,కొత్తగూడ మండల పార్టీ అధ్యక్షుడు వజ్జే సారయ్య,గంగారం మండల పార్టీ అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు,మండల ముఖ్య నాయకులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గారు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Seethakka: గ్రామపంచాయతీ యువ నాయకత్వంతో గ్రామాభివృద్ధి జరగడం ఖాయం : మంత్రి ధనసరి సీతక్క
గ్రామ అభివృద్ధి కోసం పని చేయాలి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం మండలాల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక స్థానాల్లో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గెలుపొందిన సర్పంచులు కార్యవర్గ సబ్యులు గ్రామ అభివృద్ధి కోసం పని చేయాలని మండలాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున ఎప్పటికీ సహకరిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య గారు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి గారు,రాష్ట్ర, జిల్లా,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

