Crime: అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్ లక్ష విలువైన సొత్తు స్వాధీనం
Crime( IMAGE credit: swetcha reporter)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Crime: అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్ లక్ష విలువైన సొత్తు స్వాధీనం

Crime: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్ రాష్ట్ర దొంగను మహబూబాబాద్(Mahbubabad)పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సుమారు ₹1 లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎన్. తిరుపతిరావు తెలిపారు. మహబూబాబాద్ ద్(Mahbubabadటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, రాజమహేంద్రవరం జిల్లాకు చెందిన గొర్రెల చిన్నబాబు అనే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నాడని, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.  ఉదయం నర్సంపేట బైపాస్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా, హోండా షైన్ వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన చిన్నబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో తాను ఆరు దొంగతనాలు చేసినట్లు అతను అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు.

Also Read: India on US Tariff: అమెరికా, ఈయూకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. లెక్కలు తీసి మరి చురకలు!

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు
మే 31న డోర్నకల్‌లో చోరీ అయిన ఒక హోండా షైన్ ద్విచక్ర వాహనం, మహబూబాబాద్ రామచంద్రాపురం కాలనీలో 4.5 గ్రాముల బంగారు, 8 గ్రాముల వెండి ఆభరణాలు. మహబూబాబాద్ ఆర్టీసీ కాలనీలో 40 తులాల వెండి ఆభరణాలు. మహబూబాబాద్‌తో పాటు నర్సంపేట, కోదాడలో జరిగిన రెండు దొంగతనాలను కూడా చిన్నబాబు ఒప్పుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

 Also Read: Case on Namrata: డాక్టర్ నమ్రతకు బిగుస్తున్న ఉచ్చు.. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి

Just In

01

Vithika New House: వరుణ్ సందేశ్ కలల సౌధాన్ని చూశారా.. ఏం ఉంది బాసూ..

MLA Anirudh Reddy : కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే కన్నెర్ర చేస్తాం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Dandora Movie Trailer: శివాజీ ‘దండోరా’ ట్రైలర్ వచ్చేసింది.. ఆ మత్తు దిగాలంటే టైమ్ పట్టుద్ది సార్..

KTR: అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమయ్యాయి: కేటీఆర్

Leopard in Naravaripalli: నారావారిపల్లెలో చిరుత సంచారం.. సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలోనే..