Case on Namrata(Image credit: free pic twitter)
తెలంగాణ

Case on Namrata: డాక్టర్ నమ్రతకు బిగుస్తున్న ఉచ్చు.. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి

Case on Namrata: సంతానం కోసం ఆశ్రయించి డాక్టర్ నమ్రత(Dr. Namrata)చేతుల్లో దారుణంగా మోసపోయిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సరోగసి పేరుతో తమ నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టిన తీరుపై పోలీసులకు ఫిర్యాదులు ఇస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ నమ్రత(Dr. Namrata)పై గోపాలపురం పోలీస్ స్టేషన్‌(Gopalapuram Police Station)లో మరో నాలుగు ఎఫ్ఐఆర్‌లు జారీ అయ్యాయి. కాగా, ఈ కేసులో పోలీసులు మరో డాక్టర్ విద్యులతను అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్‌ల సంఖ్య 13కి చేరింది. సరోగసి పేర చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 Also Read: Meenakshi Natarajan: ఢిల్లీ వెళ్లిన మీనాక్షి నటరాజన్.. బీసీ నేతలతో రైలు ప్రయాణం

ఇదే కేసులో మరో 12 మందిని కూడా పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ప్రస్తుతం కోర్టు అనుమతితో డాక్టర్ నమ్రత, (Dr. Namrata)కల్యాణి, ధనశ్రీ సంతోషిలను కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, డాక్టర్ నమ్రత పోలీసుల విచారణకు పెద్దగా సహకరించడం లేదని సమాచారం. మొదటి రోజు అంతా కల్యాణికే తెలుసని తప్పించుకునే ధోరణిలో జవాబులు ఇచ్చింది. అయితే, మేడం చెప్పినట్టే చేశామని కళ్యాణి, ధనశ్రీ సంతోషిలు చెప్పడంతో ఆమెకు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో తాను సరోగసి పేర మోసాలు చేయలేదని, బిడ్డల దత్తత మాత్రమే ఇచ్చానని డాక్టర్ నమ్రత మాట మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెపై తాజాగా మరో నాలుగు ఫిర్యాదులు పోలీసులకు అందాయి.

కేసులు నమోదు

నల్గొండకు చెందిన దంపతులు సరోగసి ద్వారా బిడ్డ పుట్టేలా చేస్తానని డాక్టర్ నమ్రత తమ నుంచి రూ.44లక్షలు తీసుకున్నట్టు పోలీసులకు తెలిపారు. డాక్టర్ నమ్రత(Dr. Namrata) తన గ్యాంగ్ సభ్యులు డాక్టర్ సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖలతో కలిసి మోసం చేసినట్టు పేర్కొన్నారు. దాంతో వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక, హైదరాబాద్‌కు చెందిన మరో మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సరోగసి పేర అమ్మానాన్నలను చేస్తానని నమ్మించిన డాక్టర్ నమ్రత(Dr. Namrata) హైదరాబాద్‌9Hyderabad)లో తనకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చిందని తెలిపింది.

ఆ తర్వాత తనను, తన భర్తను వైజాగ్ పంపించినట్టు పేర్కొంది. అక్కడ కళ్యాణి తన భర్త నుంచి స్పెర్మ్ తీసుకున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో తమ నుంచి రూ.18లక్షలు తీసుకున్నట్టు పేర్కొంది. ఈ ఫిర్యాదుపై పోలీసులు డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యులత, శ్రీనివాస్ రెడ్డి, శేషగిరిలపై కేసులు పెట్టారు. ఇక, డాక్టర్ నమ్రత(Dr. Namrata) ఎన్నారైలను కూడా మోసం చేసినట్టు మరో ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. సంతాన భాగ్యం కలిగిస్తామని తమ నుంచి రూ.25లక్షలు తీసుకున్నట్టు ఎన్నారై దంపతులు ఫిర్యాదు ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన మరో జంట నుంచి ఇలాగే రూ.50లక్షలు కొల్లగొట్టినట్టు ఇంకో ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. దీనిపై డాక్టర్ నమ్రత, చెన్నారావు, సురేఖలపై కేసులు నమోదు చేశారు.

మరో డాక్టర్ అరెస్ట్
సరోగసి పేర పదుల సంఖ్యలో మోసాలకు పాల్పడి కోట్లు కొల్లగొట్టిన డాక్టర్ నమ్రతకు సహకరించిన మరో డాక్టర్ విద్యులతను పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు పారిపోయే యత్నం చేస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ విద్యులతను కూడా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని విచారించాలని అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. కేసులో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్న పోలీసులు డాక్టర్ నమ్రత(Dr. Namrata) కు శిశు విక్రయ ముఠాలతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ గ్యాంగుల ద్వారా వేల రూపాయలకు శిశువులను కొని సరోగసి ద్వారా పుట్టిన పిల్లలని తన వద్దకు సంతానం కోసం వచ్చిన వారికి ఇచ్చి లక్షలు గుంజిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగులతో డాక్టర్ నమ్రత(Dr. Namrata) కు సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 Also Read: Guvvala Balaraju: గులాబీని ఖాళీ చేసేలా కమలం స్కెచ్.. లోకల్‌‌‌‌కు ముందే దెబ్బకొటేలా ప్లాన్

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?