Actress Vijayalakshmi | నటికి ఏడు సార్లు అబార్షన్
ఎంటర్‌టైన్‌మెంట్

Actress Vijayalakshmi : నటికి ఏడు సార్లు అబార్షన్

Actress Vijayalakshmi : నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌‌(Seamon)పై వేధింపుల కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను వివాహం చేసుకుంటానని మోసానికి పాల్పడటంతో 7 సార్లు అబార్షన్‌ జరిగిందని నటి విజయలక్ష్మి 2011లో పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసారు. ఆ తర్వాత ఈ కేసుని కొట్టివేయాలని సీమాన్‌‌ హైకోర్టు(High court)లో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపైన విచారణ జరిపిన న్యాయస్థానం కేసు కొట్టేయడం కుదరని స్పష్టం చేసింది. 12 వారాల్లోగా ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక అందజేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే సీమాన్‌‌ పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి జస్టిస్‌ ఇళంతిరైయన్‌ ఈ విధంగా తీర్పు వెల్లడించారు.

నటి విజయలక్ష్మి.. సీమాన్‌‌ డైరెక్షన్‌లో వచ్చిన ఓ సినిమాలో నటించిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరు కొద్దిగా క్లోజ్ అయ్యారు. కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని, సీమాన్‌‌ని విజయలక్ష్మి సంప్రదించింది. ఇక అప్పటి నుంచి పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేది. ఈక్రమంలోనే విజయలక్ష్మికి పెళ్లి చేసుకుంటానని సీమాన్ మాటిచ్చాడు. ఇక అతడికి కమిట్ అయ్యింది. ఇద్దరు కూడా లైంగికంగా కలిసేవారు. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అనేక సార్లు లైంగికంగా కలుసుకున్నారు. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు విచారణల్లో భాగంగా మహిళ కోర్టులో సీమాన్ మాట్లాడుతూ.. ఇద్దరు అంగీకారంతో లైంగికంగా కలుసుకున్నామని, ఇది నేరమేమి కాదని కోర్టుకు తెలిపారు. 2011లో ఇచ్చిన ఫిర్యాదుని విజయలక్మి 2012 వెనక్కి తీసుకుందని సీమాన్ కోర్టుకు వివరించారు. అయితే అందరూ ముందు తనను పెళ్లి చేసుకుంటానని సీమాన్ ఒప్పుకోవడంతో కేసు వెనక్కి తీసుకున్నానని విజయలక్ష్మి న్యాయమూర్తులకు తెలిపింది.

Select Ajith Kumar : అజిత్‌కు తప్పిన ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

అయితే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నట్లు విజయలక్షి.. న్యాయమూర్తికి ఇచ్చిన లేఖ స్థానిక పోలీస్ స్టేషన్‌కు అందలేదన్నారు. దీంతో ఆ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఇద్దరు మధ్య ఉన్నది ప్రేమ కాదని, ఆమెను లైంగికంగా వాడుకున్నాడని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. దీంతో ఆమె ఏడు సార్లు అబార్షన్‌ చేయించుకుందని వెల్లడించారు. ఇంకా విజయలక్ష్మి నుంచి భారీగా డబ్బును సీమాన్ గుంజాడని పేర్కొన్నారు. మానసిక ఒత్తడి, బెదిరింపులు వల్లే కేసు వెనక్కి తీసుకుందని వివరించారు. 2023 వరకు ఇద్దరి మధ్య బంధం కొనసాగిందని, ఈ కేసును రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు.

Just In

01

Maruthi Surprise: అడ్రస్ ఇచ్చినందుకు మారుతీ ఇంటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఏం పంపారో తెలుసా?.. ఇది వేరే లెవెల్..

DCP Aravindh Babu: బ్యాంక్ ఖాతాలు సమకూరిస్తే కటకటాలే.. సైబర్​ క్రైం డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్!

Ghantasala Biopic: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ.. ఎప్పుడంటే?

Basti Dawakhana: బస్తీ దవాఖానల డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సమస్యలకు చెక్.. కొత్త సిస్టమ్ అమలు..!

Uttarakhand : ఉత్తరాఖండ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. 60 మందికి గాయాలు