Maruthi Surprise: మారుతీ ఇంటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఏం పంపారంటే?
prabhas-fans
ఎంటర్‌టైన్‌మెంట్

Maruthi Surprise: అడ్రస్ ఇచ్చినందుకు మారుతీ ఇంటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఏం పంపారో తెలుసా?.. ఇది వేరే లెవెల్..

Maruthi Surprise: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న ప్రమోషన్లు, దర్శకుడు-అభిమానుల మధ్య జరుగుతున్న సంభాషణలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Reada also-Anil Ravipudi: శివాజీ వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించిన అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే?

మారుతి సవాల్..

సాధారణంగా దర్శకులు తమ సినిమా బాగుంటుందని చెబుతారు. కానీ మారుతి ఒక అడుగు ముందుకు వేసి, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “ఈ సినిమా మీకు ఏ మాత్రం నచ్చకపోయినా.. నా ఇంటి అడ్రస్ ఇస్తాను, వచ్చి నన్ను అడగండి” అంటూ తన ఇంటి అడ్రస్‌ను బహిరంగంగా ప్రకటించారు. తన వర్క్ మీద ఆయనకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. దీంతో ట్రైలర్ 2.0 చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. మారుతి చెప్పినట్టు విమర్శించడానికి కాకుండా, ఆయన ఇచ్చిన అదిరిపోయే అవుట్‌పుట్‌కు కృతజ్ఞతగా ప్రభాస్ అభిమానులు ఒక వెరైటీ ప్లాన్ చేశారు. మారుతి ఇంటికి ఏకంగా బిర్యానీ పార్సిల్స్ పంపించి తమ ప్రేమను చాటుకున్నారు.

Read also-Ghantasala Biopic: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ.. ఎప్పుడంటే?

మారుతి పోస్ట్ వైరల్

అభిమానులు పంపిన బిర్యానీని చూసి ఆశ్చర్యపోయిన మారుతి, వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “డార్లింగ్స్.. మీ ప్రేమను మాటల్లో చెప్పలేను. ఇంటికి రాగానే ఈ సర్ప్రైజ్ చూసి షాక్ అయ్యాను. ది రాజాసాబ్ ట్రైలర్‌పై మీరు చూపిస్తున్న ప్రేమికు, ఈ బిర్యానీకి చాలా థాంక్స్. జనవరి 9న మీ అందరికీ థియేటర్లలో ‘ఫుల్ మీల్స్’ పెడతాను” అని పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ పోస్ట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత ఒక వింటేజ్ లుక్‌లో, ఎనర్జిటిక్ రోల్‌లో చూపిస్తున్న మారుతిపై ఫ్యాన్స్ పూర్తి భరోసాగా ఉన్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానుంది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, ప్రభాస్ కామెడీ టైమింగ్ చూస్తుంటే, మారుతి అన్నట్టుగానే జనవరి 9న ప్రేక్షకులకు వెండితెరపై ఒక పెద్ద విందు భోజనం గ్యారెంటీ అనిపిస్తోంది. దర్శకుడు, హీరో అభిమానుల మధ్య ఇలాంటి సరదా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం సినిమాపై మరింత పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది.

Just In

01

Sankranti Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. మరికొన్ని స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు మీకోసం..!

Illegal Liquor Sales: మద్యం మత్తులో నియోజకవర్గం.. ప్రథమ స్థానంలో అశ్వారావుపేట రెండోస్థానంలో..?

LG Gallery TV: ప్రపంచ టెక్ షో CES 2026లో ఎల్‌జీ గ్యాలరీ టీవీ ఆవిష్కరణ..

Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

Urea Black Marketing: యూరియా దందాకు తెర లేపిన ప్రైవేట్ ఫర్టిలైజర్స్.. రెట్టింపు ధరలతో అన్నదాతలు ఆగమాగం