Ghantasala Biopic: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘ఘంటసాల ది గ్రేట్’..
ghantasala-biopick
ఎంటర్‌టైన్‌మెంట్

Ghantasala Biopic: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ.. ఎప్పుడంటే?

Ghantasala Biopic: దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఓ మంచి పాట లాంటి సినిమాను శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల వారి పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. కీలక పాత్రలో సుమన్ నటించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో స్వరవాహిని, శ్రీభారతి మ్యూజిక్ అకాడమీ వారు కలిసి ‘ఘంటసాల ది గ్రేట్ స్పెషల్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్‌ను నిర్వహించారు.

Read also-Om Shanti Shanti Shantihi: ‘సిన్నారి కోన’ పాటొచ్చింది.. తరుణ్, ఈషా రెబ్బా జంట ఎంత బావుందో!

ఈ కార్యక్రమంలో.. దర్శకుడు సి.హెచ్. రామారావు మాట్లాడుతూ.. ‘‘ఘంటసాల వారి పాటల గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని చేశాను. ఓ సారి శ్రీశ్రీ గారు ఘంటసాల వారి వద్దకు వెళ్లారు. ఆయన రాసిన పాటను ఘంటసాల వారు పాడిన తరువాత శ్రీశ్రీ గారు మంత్ర ముగ్దులయ్యారు. ‘నేను ఇంత గొప్ప పాట రాశానా? అని మీరు పాడిన తరువాత అనిపిస్తోంది’ అని శ్రీశ్రీ ప్రశంసించారు. అంత గొప్ప గాయకుడు ఘంటసాల. అందుకే ‘ఘంటసాల ది గ్రేట్’ అని టైటిల్ పెట్టాం. మా మూవీని రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చిన శోభ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం ఇప్పటికే ఖండాంతరాలు దాటింది. ఆస్ట్రేలియాలో ఈ మూవీని ప్రదర్శించాం. ఈ మూవీని తెలుగు ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘మహోన్నతమైన వ్యక్తి ఘంటసాల. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ ఘన విజయం సాధించాలి. ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సరే ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి’ అని అన్నారు. శోభా రాణి మాట్లాడుతూ.. ‘ఘంటసాల వారి గురించి చెప్పడానికి నా జీవితం సరిపోదు. నేను ఇప్పటి వరకు దాదాపు 76 చిత్రాల్ని రిలీజ్ చేశాను. ఎన్నో సినిమాల్ని రిలీజ్ చేశాను కానీ అవన్నీ ఒకెత్తు.. ఈ ‘ఘంటసాల ది గ్రేట్’ ఒకెత్తు. ఈ మూవీని రిలీజ్ చేస్తాను అని నేనే రామారావు గారిని అడిగాను. రామారావు గారు ఎంతో కష్టపడి ఈ మూవీని చేశారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. జనవరి 2న మా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది’ అని అన్నారు.

Read also-Prabhas Kindness: హీరోయిన్ రిద్ధి కుమార్‌ ప్రభాస్‌కు ఇచ్చిన గిఫ్ట్ ఇదే.. ఆమె ఏం తీసుకున్నారంటే?

సంగీత దర్శకుడు రవి శంకర్ మాట్లాడుతూ.. ‘నేను ఓ సంగీత దర్శకుడిగా ఘంటసాల వారి గురించి మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. మహ్మద్ రఫీ, బడే గులాం అలీ ఖాన్, కిషోర్ కుమార్ వంటి వారితో పోటీ పడీ మరీ పాడారు. అందుకే ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్లారు. సూర్యచంద్రులున్నంత వరకు ఆయన ఖ్యాతి అలా ఉంటుంది. శోభా గారు ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

అంతే కాకుండా ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని సెలెబ్రిటీలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రివ్యూని సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, సింగర్ కౌసల్య, సింగర్ విజయలక్ష్మీ తదితరులు వీక్షించారు. సినిమాను వీక్షించిన అనంతరం రఘు కుంచె, కౌసల్య, విజయలక్ష్మీ వంటి వారు తమ తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. అద్భుతమైన సినిమాను తెలుగు ప్రేక్షకులంతా చూడాలని అన్నారు. తెలుగు ప్రజలందరూ చూడాల్సిన, తెలుసుకోవాల్సిన కథ అని పొగిడారు. ఘంటసాల వారి వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని ప్రివ్యూ చూసిన అందరూ అన్నారు.

Just In

01

LG Gallery TV: ప్రపంచ టెక్ షో CES 2026లో ఎల్‌జీ గ్యాలరీ టీవీ ఆవిష్కరణ..

Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

Urea Black Marketing: యూరియా దందాకు తెర లేపిన ప్రైవేట్ ఫర్టిలైజర్స్.. రెట్టింపు ధరలతో అన్నదాతలు ఆగమాగం

Without Railway Station: ఇదేందయ్యా ఇది.. ఆ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదా? భలే విచిత్రంగా ఉందే!

Minister Ponguleti: కటౌట్లు చూసి టికెట్ ఇవ్వం.. గెలిచే గుర్రాలకే బీఫామ్: మంత్రి పొంగులేటి!