Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ విన్నా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పేరు బాగా వినిపిస్తుంది. ఈ మధ్య కుర్రాడిలా మారి ఆయన చేస్తున్న ఫొటోషూట్ ఫొటోలు బయటకు వచ్చినప్పటి నుంచి.. మెగా జపం మొదలైంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయన తన సినిమాల వేగాన్ని, రేంజ్‌ను కూడా పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ లైనప్ చూస్తుంటేనే మెంటలొచ్చేస్తోంది. ఒకవైపు కమర్షియల్ మాస్ సినిమాలు చేస్తూనే, మరోవైపు విభిన్నమైన దర్శకులతో ప్రయోగాత్మక చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ లిస్ట్‌లో ఒక కోలీవుడ్ దిగ్గజ దర్శకుడి పేరు వినిపిస్తుండటంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ దర్శకుడెవరు? ఏంటా కథ? అనే విషయంలోకి వస్తే..
తమిళ స్టార్ డైరెక్టర్‌తో మెగా మూవీ?
కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran). రియలిస్టిక్ కథలు, రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో నేషనల్ అవార్డులను కొల్లగొట్టడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ చిరంజీవి కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, దానికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి వెట్రిమారన్ సినిమాలు అంటేనే సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి. ఒకవేళ మెగాస్టార్‌తో ఆయన జతకడితే, ‘స్వయంకృషి, రుద్రవీణ’ వంటి క్లాసిక్స్ తర్వాత మళ్ళీ అదే స్థాయి రియలిస్టిక్ సినిమా చూసే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read- Om Shanti Shanti Shantihi: ‘సిన్నారి కోన’ పాటొచ్చింది.. తరుణ్, ఈషా రెబ్బా జంట ఎంత బావుందో!
షాకింగ్ లైనప్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి 2026 కానుకగా రిలీజ్ కానుంది. ఇందులో మెగాస్టార్‌తో పాటు వెంకటేష్ కూడా కనిపించబోతున్నారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రాఫిక్స్ పనుల వల్ల ఇది 2026 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీతో ఓ గ్యాంగ్ స్టర్ డ్రామా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ ఒక భారీ యాక్షన్ సినిమా చేయనున్నారు. ‘బ్లడ్ బాత్’ అంటూ శ్రీకాంత్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చి అంచనాలను పెంచేశారు. ఈ లైనప్‌లోకి ఇప్పుడు వెట్రిమారన్ సినిమా కూడా చేరితే.. మెగాభిమానుల ఆనందానికి అవధులుండవు.
Also Read- Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
వెట్రిమారన్ సినిమా నిజమేనా?
వెట్రిమారన్ సినిమాలు అంటే సామాజిక అంశాలు, గ్రిప్పింగ్ నరేషన్ ఉంటాయి. వెట్రిమారన్ – చిరు కాంబో నిజమైతే, మెగాస్టార్ తన నటనతో నేషనల్ అవార్డ్ సాధించడం గ్యారంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది రూమర్ కాకుండా నిజమైతే మాత్రం, ఇండియన్ సినిమాలో ఇదొక బిగ్గెస్ట్ కొలాబరేషన్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి తన 70వ పడిలో కూడా ఇంతటి ఉత్సాహంతో సినిమాలు ఓకే చేయడం చూస్తుంటే.. మెగా ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పాలి. ఈ వరుస చూస్తుంటే 2026, 2027 సంవత్సరాలను చిరు తన ఖాతాలో వేసుకున్నట్లు కనిపిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

