Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ
Mega Victory Mass Song (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mana Shankara Varaprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాసీవ్ ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చేసింది. సాంగ్ అనౌన్స్‌మెంట్‌తోనే దుమ్మురేపిన చిరు, వెంకీ.. ఇప్పుడు పాటతో ఒక్కసారిగా మెగా, విక్టరీ అభిమానులకు ముందే పండగ తెచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. వారి డ్యాన్స్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు. ఈ సాంగ్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్‌గా మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయడం కాయం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌ని గ్రాండ్‌గా స్టార్ట్ చేసే పర్ఫెక్ట్ సాంగ్‌గా ప్రస్తుతం ఈ సాంగ్ కొనియాడబడుతోంది.

Also Read- Allu Aravind: కొడుకుకి సక్సెస్ వస్తే వచ్చే ఆనందం.. నాకంటే బాగా ఎవరికీ తెలియదు!

డ్యాన్స్ మూమెంట్స్ వావ్..

ఈ సాంగ్‌ని గమనిస్తే.. డెనిమ్ లుక్, సన్‌గ్లాసెస్‌తో చిరంజీవి మెగా స్వాగ్‌తో కనిపిస్తే, రెడ్ జాకెట్‌లో వెంకటేశ్ కనిపించారు. అంతేకాదు, సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా సాంగ్ మధ్యలో పంచెలు కట్టుకుని, చెఱకు గడలు పట్టుకుని మరీ పండగ వైబ్ తెచ్చేశారు. ఇక ఇద్దరూ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే వావ్ అనాల్సిందే. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బీట్.. ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేయిస్తోందంటే అతిశయోక్తి కానే కాదు. ఈ పాటకు నకాష్ అజీజ్, విశాల్ దడ్లానీ ఎనర్జిటిక్ వోకల్స్ అందరితో హమ్మింగ్ చేయిస్తున్నాయి. చంటి అంటూ వెంకీని, బాస్ అంటూ చిరుని మిక్స్ చేస్తూ కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు.

Also Read- Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు

‘మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైంటీ
ఎవడైతే ఏంటి.. కుమ్మేద్దాం చంటి
హే.. వెంకీ.. ఇచ్చెయ్యి థమ్కీ’ అని చిరు అంటుంటే..

స్పీడేమో 5జి.. స్టైలేమో జెన్ జి
వారేవా సర్ జి.. వుయ్ ఆర్ సో క్రేజీ
హే.. బాసు.. పెంచెయ్యి బేసు..’ అంటున్నాడు వెంకీ. ఇలా ఇద్దరి క్రేజ్‌కు సరిపడేలా కాసర్ల శ్యామ్ ఈ పాటకు అందించిన సాహిత్యం హైలెట్ అని చెప్పుకోవాలి. మొత్తంగా అయితే ఈ పాటతో ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకోవడం మాత్రం పక్కా. అందులో డౌటే లేదు. ఇద్దరు అగ్ర హీరోలను ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటం, ఇరు హీరోల అభిమానులకు పండగ అనే చెప్పాలి. ఆ పండగ వాతావరణాన్ని ఈ పాటతో ఇచ్చారీ అగ్రహీరోలు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరీస్ థ్రెసా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chinese Manja: ‘చైనా మాంజా విక్రయాలను అరికట్టాలి’.. సీఐకి డివైఎఫ్ఐ వినతి

Beauty OTT: ‘బ్యూటీ’ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?

Hydraa: దుర్గం చెరువు ఆక్ర‌మ‌ణ‌లకు హైడ్రా చెక్‌.. కబ్జా చెర నుంచి 5 ఎకరాలకు విముక్తి

Municipal Elections: పట్టణాల్లో ఎన్నికల వేడి.. ఆశావహుల్లో ఉత్కంఠ

New Year 2026 Wishes : మీ ప్రియమైన వారికీ న్యూ ఇయర్ విషెస్ ఇలా చెప్పేయండి!