Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ ప్రమాదం..
Uttarakhand ( Image Source: Twitter)
జాతీయం

Uttarakhand : ఉత్తరాఖండ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. 60 మందికి గాయాలు

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగడ్–పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు చెందిన పిపల్కోటి టన్నెల్‌లో కార్మికులు, అధికారులు ప్రయాణిస్తున్న లోకో రైలు ఒక సరుకు రైలుతో ఢీకొనడంతో సుమారు 60 మంది గాయపడ్డారు.

ఈ ఘటన సమయంలో ఆ లోకో రైలులో మొత్తం 109 మంది ఉన్నట్లు చమోలీ జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టగా, రైలులో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు.

Also Read: Hyderabad Vijayawada Train: హైదరాబాద్-విజయవాడ ట్రైన్ జర్నీ 3 గంటలే!.. దక్షిణమధ్య రైల్వే అదిరిపోయే ప్రతిపాదన

కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, THDC (ఇండియా) నిర్మిస్తున్న ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో ఒక రైలు కార్మికులు, అధికారులను తరలిస్తుండగా, మరో రైలు నిర్మాణ సామగ్రిని మోస్తూ వెళ్తోంది. ఈ రెండు లోకో రైళ్లు టన్నెల్‌లో ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఢీకొన్నాయి.

Also Read: Huzurabad News: ప్రభుత్వ భూమిని కాపాడలేరా? అధికారులారా అంటూ.. మొలంగూరు నేతల ఘాటు విమర్శలు!

టన్నెల్‌ నిర్మాణ సమయంలో కార్మికులు, అధికారులు, అలాగే అవసరమైన సామాగ్రిని తరలించేందుకు ఈ తరహా లోకో రైళ్లను వినియోగిస్తారని అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిలో 10 మందిని గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించినట్లు చమోలీ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ వెల్లడించారు.

Also Read: Baba Vanga Predictions 2026: 2026లో ప్రపంచానికి ఏలియన్ల ముప్పు ఉందా.. బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమవుతాయా?

444 మెగావాట్ల సామర్థ్యం గల ఈ విష్ణుగడ్–పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్ట్ అలకనంద నదిపై, హెలాంగ్ నుంచి పిపల్కోటి మధ్య నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నాలుగు టర్బైన్ల సహాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.

Just In

01

LG Gallery TV: ప్రపంచ టెక్ షో CES 2026లో ఎల్‌జీ గ్యాలరీ టీవీ ఆవిష్కరణ..

Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

Urea Black Marketing: యూరియా దందాకు తెర లేపిన ప్రైవేట్ ఫర్టిలైజర్స్.. రెట్టింపు ధరలతో అన్నదాతలు ఆగమాగం

Without Railway Station: ఇదేందయ్యా ఇది.. ఆ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదా? భలే విచిత్రంగా ఉందే!

Minister Ponguleti: కటౌట్లు చూసి టికెట్ ఇవ్వం.. గెలిచే గుర్రాలకే బీఫామ్: మంత్రి పొంగులేటి!