Baba Vanga Predictions 2026: 2026 ఏడాది దగ్గర పడుతున్న కొద్దీ, బాబా వంగా పేరు మళ్లీ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. బాల్కన్ ప్రాంత నోస్ట్రాడామస్‌గా పేరున్న ఈ బల్గేరియన్ జ్యోతిష్కురాలు, గతంలో ప్రిన్సెస్ డయానా మరణం, కరోనా వంటి సంఘటనలను ముందే చెప్పిందని చాలామంది నమ్ముతారు. అందుకే ఆమె చెప్పినట్లు ప్రచారం అవుతున్న 2026 భవిష్యవాణులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశమా?
బాబా వంగా అంచనాల ప్రకారం, 2026లో పెద్ద స్థాయి యుద్ధ పరిస్థితులు రావచ్చని కొందరు చెబుతున్నారు. ఇందులో అమెరికా, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలు కూడా భాగమవుతాయనే ప్రచారం ఉంది. తైవాన్ సమస్య, పాశ్చాత్య దేశాలు–తూర్పు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి, ఈ మాటలు వినగానే చాలా మందికి భయం కలుగుతోంది.
ప్రకృతి విపత్తులు ఎక్కువ అవుతాయా?
2026లో భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, వర్షాలు, ఎండలు అతిగా ఉండటం లాంటి ప్రకృతి సమస్యలు పెరుగుతాయని కూడా చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల వరదలు, అడవుల్లో మంటలు లాంటి సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఈ అంచనాలు నిజమేనా అన్న చర్చ జరుగుతోంది.
ఏలియన్లు నిజంగానే వస్తారా?
2026లో మనుషులకు భూమికి బయట జీవులతో పరిచయం అవుతుందన్న మాట కూడా వినిపిస్తోంది. 2025లో 3I/ATLAS అనే ఒక అంతరిక్ష వస్తువును శాస్త్రవేత్తలు గుర్తించారు. వాళ్లు అది సహజంగా వచ్చిన ఖగోళ వస్తువే అంటున్నారు. అయినా సరే, ఎలియన్ల గురించిన ఊహాగానాలు మాత్రం తగ్గడం లేదు.
ప్రపంచ శక్తులు మారతాయా?
బాబా వంగా చెప్పినట్లు ప్రచారం అవుతున్న మాటల ప్రకారం, రాబోయే కాలంలో ప్రపంచంలో శక్తి ఆసియా వైపు, ముఖ్యంగా చైనా వైపు మళ్లుతుందట. అలాగే 2026లో డబ్బు సమస్యలు, బ్యాంకులు కుదేలవడం, ధరలు పెరగడం లాంటి ఆర్థిక ఇబ్బందులు రావచ్చని కూడా అంటున్నారు.
కానీ, ఇవన్నీ నమ్మకాలపై ఆధారపడి చెప్పే మాటలే తప్ప ఖచ్చితంగా జరిగే విషయాలు కావు అని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి భవిష్యవాణులను విని భయపడకుండా, నిజమైన సమాచారం, శాస్త్రీయ నివేదికలు, అధికారిక వార్తలనే నమ్మడం మంచిదని సూచిస్తున్నారు.

