Student Suicide Attempt: కళాశాల భవనం పైనుంచి కిందకు దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నల్లగొండ పట్టణ పరిధిలోని చర్లపల్లి సోషల్ వేల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు(SI Saidababu) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్థిని సూసైడ్ లేఖలో..
నల్గొండ(Nalgonda) జిల్లా చండూరు(Chanduru) మండలానికి చెందిన ఓ విద్యార్థిని చర్లపల్లి గురుకుల డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం కళాశాల భవనం మూడో అంతస్తు పైనుండి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు, అధ్యాపకులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విద్యార్థిని సూసైడ్ లేఖలో పేర్కొంది. విద్యార్థిని మెడ, తలపై గాయాలుండడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని భవనం పైనుంచి దూకే దృశ్యం కళాశాల సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు.
Also Read: India vs South Africa: చివరి టీ20లో టాస్ పడింది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే?

