Jogipet Accident News: నియంత్రణ లేని పందుల సంచారం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జోగిపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఆటోకు పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఎస్ఐ పాండు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: MP Mallu Ravi: అహంతోనే గాంధీ పేరు తొలగింపు.. కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజం
తెల్లవారుజామున 5 గంటల సమయం
జోగిపేట(Jogipeta) మండలం అచ్చన్నపల్లి(Achannapally) తాండాకు చెందిన స్వరూప(Swarupa) (34) గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆటోలో సంగారెడ్డి(Sangareddy)కి బయలుదేరారు. మార్కెట్ యార్డ్ మీదుగా వెళ్తుండగా అకస్మాత్తుగా పందులు అడ్డు రావడంతో ఆటో వాటిని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వరూపను స్థానికులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందారు. మృతురాలి తల్లి మాలోల్ కొఖరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వరూప మృతితో అచ్చన్నపల్లి తాండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: Rahul Gandhi – MGNREGA: ‘ఉపాధి హామీ పథకాన్ని కూల్చేశారు’.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ

