MP Mallu Ravi: అహంతోనే గాంధీ పేరు తొలగింపు
MP Mallu Ravi ( image credit: swetcha reporter)
Political News

MP Mallu Ravi: అహంతోనే గాంధీ పేరు తొలగింపు.. కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజం

MP Mallu Ravi: గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అహంకారాన్ని చాటుకుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, లోక్‌సభలో తమకు ఉన్న మెజార్టీని అడ్డం పెట్టుకుని, ప్రతిపక్షాల అభ్యర్థనలను ఏమాత్రం వినకుండా ఈ బిల్లును ఆమోదించుకున్నారని మండిపడ్డారు. పథకం నుంచి గాంధీ పేరును తీసివేయవద్దని తాము చేసిన డిమాండ్‌ను కేంద్రం బేఖాతరు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: MP Mallu Ravi: ఇండియా కూటమి ఎంపీల అరెస్టుపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం!

60:40 నిష్పత్తిలో నిధులు చెల్లించాలి

కాంగ్రెస్ హయాంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని, కానీ ఇప్పుడు 60:40 నిష్పత్తిలో నిధులు చెల్లించాలని కొత్త బిల్లులో నిబంధన పెట్టడం సరికాదని రవి పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని, ఫలితంగా పేదలకు అందే ఉపాధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీకి మహాత్మా, జాతిపిత అనే బిరుదులను ప్రజలే ఇచ్చారు. ఆయన పేరును బీజేపీ రికార్డుల నుంచి తీసివేయవచ్చు కానీ, ప్రజల హృదయాల నుంచి చెరిపేయలేరని ఎంపీ స్పష్టం చేశారు. నాడు గాడ్సే గాంధీని భౌతికంగా చంపితే, ఈరోజు బీజేపీ ఆయన ఆత్మను చంపే ప్రయత్నం చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ ఆత్మ ప్రతి భారతీయుడిలో ఉందని, ఇలాంటి చర్యలను ప్రజలు క్షమించరని రవి హెచ్చరించారు.

Also Read: Mallu Ravi: గద్వాల్ భవిష్యత్తుకు బలమైన హామీలు.. ఎంపీ మల్లురవి కీలక నిర్ణయాలు

Just In

01

Uttam Kumar Reddy Warning: భయం ఉన్నోళ్లు వెళ్లిపోండి.. నేను రంగంలోకి దిగుతా.. మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

Live-in Relationships: లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ చట్టవిరుద్ధం కావు.. 12 జంటలకు రక్షణ ఇచ్చిన హైకోర్టు

Ram Goapal Varma: ఇండస్ట్రీకి ధురంధర్ గుణపాఠం.. హీరోలకు ఎలివేషన్స్ అక్కర్లే.. డైరెక్టర్లకు ఆర్జీవీ క్లాస్!

Karimnagar Cricketer: ఐపీఎల్‌లో కరీంనగర్ కుర్రాడు.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అమన్ రావు ఎంపిక!

Bigg Boss9 Telugu: కామనర్‌గా వచ్చిన కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పారంటే?.. ఇది సామాన్యమైన కథ కాదు..