MP Mallu Ravi( image CREDIT: SWETCHA REPORTER)
Politics

MP Mallu Ravi: ఇండియా కూటమి ఎంపీల అరెస్టుపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం!

MP Mallu Ravi: ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఈసీని కలవడానికి ప్రయత్నించిన ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి(Mallu Ravi) ఖండించారు. మోదీ, బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు తమను అడ్డుకున్నా..140 కోట్ల మందికి దేశంలో ఏం జరుగుతుందో తెలిసిందన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

 Also Read: Jr NTR: జై బాలయ్య అన్నందుకేనా.. ఫ్యాన్స్‌పై ఎన్టీఆర్ సీరియస్ అయ్యింది?

ఓట్ల చోరీ

త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ సమయంలో ఓట్ల చోరీ ఇష్యూ చర్చనీయాంశంగా మారిందన్నారు. దీని గురించి కాంగ్రెస్ సహా.. ఇండియా కూటమి ఎంపీలు ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని ప్రయత్నించారన్నారు. పార్లమెంట్ నుంచి కొంచెం దూరం రాగానే తమను పోలీసులు అడ్డుకున్నారన్నారు. దీంతో అక్కడే కూర్చొని ఆందోళన చేపట్టామన్నారు. ఈ సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారన్నారు.  మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ స్టార్ట్ అయ్యిందని, తమను సభలోకి అనుమతించలేదన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే, చివరకు సభలోకి అనుమతించారన్నారు. ఓట్ల చోరీ గురించి ప్రశ్నిస్తే.. సభ వాయిదా వేస్తున్నారన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై చర్చకు పట్టుబట్టామన్నారు.

ప్రజలు తగిన బుద్ధి చెప్తారు 

కానీ, మోదీ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదన్నారు. కీలకమైన అంశాలపైనా చర్చలు జరపడం లేదన్నారు. కనీసం జీరో అవర్‌లో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వడం లేదన్నారు. ఎలాంటి చర్చ లేకుండానే కీలక బిల్లులను ఆమోదిస్తున్నారని ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ జరగకుండా మోదీ ప్లాన్ చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసే పనులను 140 కోట్ల మంది దీన్ని గమనిస్తున్నారన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.

 Also Read: Minister Seethaka: లక్షల సంఖ్యలో కేంద్రం దొంగ ఓట్ల నమోదు: మంత్రి సీతక్క ఫైర్

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?