Minister Seethaka: ప్రజా తీర్పును దొంగిలించి దొడ్డి దారిన బిజెపి(BJP) అధికారంలోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Seethakka) ఆరోపించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీలు(MP), నేతల అక్రమ అరెస్టులను మంత్రి సీతక్క ఖండించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడం?, జైశ్రీరామ్ అంటూ దేవుడి నినాదాలు ఇస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా? కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని నిలదీశారు. బిజెపి నాయకులు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలని సవాల్ విసిరారు.
లక్షల సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు
అణచివేతలను ఆయుధంగా ఎంచుకొని అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా తీర్పు అదే విధంగా ఉంది.. కానీ దొంగ ఓట్లతో ఫలితాలను బిజెపి(BJP) తారుమారు చేసిందని మండిపడ్డారు. లక్షల సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేసి అక్రమ పద్ధతుల్లో బిజెపి పార్టీ గెలుస్తోందని దుయ్యబట్టారు. ఈడి(ED), సిబిఐ(CBI), ఐటీ(IT) సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకొని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బిజెపి పార్టీ ఎన్నికల కమిషన్(EC) తమ అధికారం కోసం వాడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ లిస్టును బయట పెడితే అప్పుడు ఎన్ని దొంగ ఓట్లు..? ఎన్ని అసలు ఓట్లు తేలిపోతుందన్నారు. కానీ బిజెపి ఆ పని చేసే సాహసం చేయదని తెలిపారు. దొడ్డి దారిన దొంగ ఓట్లతో మూడుసార్లు గెలిచిన బిజెపి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని అతలాకుతలం చేస్తుందని ఆక్షేపించారు.
Also Read: TGSRTC Job Posts: త్వరలోనే పోస్టుల భర్తీకి కసరత్తు.. సజ్జనార్ స్పష్టం!
వ్యవస్థలు అల్లకల్లోలం
మూడుసార్లు దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిరూపించేందుకు కృషి చేస్తుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవని హితవు పలికారు. బిజెపి(BJP) నాయకులు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆయుధాన్ని కూడా దొంగిలించి ప్రజాస్వామ్య వ్యవస్థను అల్లకల్లోలం చేస్తుందని ఎండగట్టారు. రాహుల్ గాంధీ పై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తరఫున యావత్ భారతదేశం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బిజెపి దుర్మార్గ నిర్ణయాలను గడపగడపకు తీసుకెళ్లి దుశ్చర్యలను బయట పెడతామన్నారు. ఇలాగే రాజ్యాంగాన్ని(Constitution) ఖూనీ చేస్తూ ఉంటే బిజెపి నాయకులను ప్రజలు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటారని తెలిపారు.
Also Read: GHMC Meeting: భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం