Bhatti Vikramarka(IMAGE credit: TWITTER)
Politics

Bhatti Vikramarka: బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న భట్టి

Bhatti Vikramarka: బీసీ రిజర్వేషన్ పై దేశ వ్యాప్తంగా మద్ధతు లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శంగా ఉన్నదన్నారు. దేశానికి దశ, దిశను నిర్దేశిస్తుందన్నారు. రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తున్నామని, తమతో పాటు గొంతు కలుపుతామని కాంగ్రెస్ ఎంపీలతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ధర్నా వద్దకు వచ్చి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు.

 Also Read: Bandi Sanjay on Congress: బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధం!

రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చట్టబద్ధమైన పనులు పూర్తి చేశామని, పార్లమెంట్లో చర్చ కోసం మన ఎంపీలు అడ్జెండ్మెంట్ మోషన్ ఇచ్చి మాట్లాడారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసిన పనికి కేంద్రమే ఆమోదముద్ర వేయాలన్నారు. దశాబ్దాల ఓబీసీలకల నెరవేరాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్తు క్యాబినెట్ ఆమోదించి బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ కు పంపామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించామన్నారు. వాటిని వెంటనే క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం కోరారు.

 Also Read: Medchal Crime: హత్యకు దారి తీసిన అప్పు వివాదం.. కత్తులతో దారుణం

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది