GHMC Meeting: జీహెచ్ఎంసీలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ(GHMC) ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 12వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు యూనియన్ జనరల్ సెక్రటరీ టి. కృష్ణ9Krishna) తెలిపారు. ఖైరతాబాద్ లోని మెట్రో పిల్లర్ నెంబర్ 1157 కు సమీపంలోనున్న మాడ్రన్ ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు జరగనున్న ఈ సమావేశానికి యూనియన్ కు చెందిన నేతలు, సభ్యులు కలిపి మొత్తం సుమారు 300 మంది హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
నాలుగు ప్రధానంశాల అజెండాతో నిర్వహించనున్న ఈ సమావేశంలో తొలుత జనరల్ సెక్రటరీ నివేదిక, కోశాధికారి నివేదికలతో పాటు యూనియన్ ఆఫీసు కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలు వంటి కార్యక్రమలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి బీఎంఎస్ రాష్ట్ర స్థాయి నేతలు తూర్పు రాంరెడ్డి(Ram Reddy), మల్లేశమ్(Mallesham) లు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: Huma Qureshi Cousin: పార్కింగ్ లొల్లి.. స్టార్ నటి కజిన్ దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా..!
ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలి
జీహెచ్ఎంసీ(GHMC)లో ప్రస్తుతం పర్మినెంట్, ఔట్ సోర్స్ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్(FRS)ను రద్దు చేయాలని భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తున్నట్లు కూడా జనరల్ సెక్రటరీ టి. కృష్ణ వెల్లడించారు. ఇదే విషయంపై ఇప్పటి వరకు పలు సార్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) కు వినతి పత్రం అందజేసిన తమ యూనియన్ తాజాగా శుక్రవారం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కు కూడా వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా రిటైర్డు మెంట్ కు దగ్గరలో ఉన్న నాలుగో తరగతి ఉద్యోగులు బీపీ(BP), షుగర్(Shugar) తో బాధపడుతూ, కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్నారని, వారికి ఎఫ్ఆర్ఎస్(FRS) అటెండెన్స్ ను అమలు చేయటంతో వారు ఆందోళనకు గురవుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని ఎఫ్ఆర్ఎస్ ను మినహాయించాలని కృష్ణ జీహెచ్ఎం(GHMC)సీ అధికారులను కోరారు. దీనికి తోడు జీహెచ్ఎంసీలోని యూనియన్లకు వెంటనే గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Also Read: Jagga Reddy: కేసీఆర్ ఫ్యామిలీ దొంగల ముఠా.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్